మనిషి ప్రాణం తీసిన రోబో.. ఆందోళనలో శాస్త్రవేత్తలు

దక్షిణ కొరియాలో రోబో ఓ వ్యక్తిని చంపేసిన సంఘటన సంచలనంగా మారింది. కూరగాయలు ప్యాక్ చేసిన బాక్స్‌లను గుర్తించాల్సిన రోబోలో సాంకేతికత లోపం తలెత్తడంతో అది మనిషిని కూడా బాక్స్‌గానే భావించి బలంగా పైకిలేపి బెల్డ్ పై పడేసింది. తీవ్ర గాయాలైన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు.

New Update
మనిషి ప్రాణం తీసిన రోబో.. ఆందోళనలో శాస్త్రవేత్తలు

దక్షిణ కొరియాలో రోబో ఓ వ్యక్తిని చంపేసిన సంఘటన సంచలనంగా మారింది. కూరగాయల ప్యాకింగ్ బాక్స్‌లను గుర్తించాల్సిన రోబోలో సాంకేతికత లోపం తలెత్తడంతో అది మనిషిని కూడా బాక్స్‌గానే భావించి బలంగా పైకిలేపి బెల్డ్ పై పడేసింది. దీంతో తీవ్ర గాయాలైన సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. ప్రస్తుతం ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవగా నెటిజన్లతోపాటు శాస్త్రవేత్తలను సైతం ఉలిక్కిపడేలా చేసింది.

వివరాల్లోకి వెళితే.. దక్షిణ కొరియాలోని ఓ వ్యవసాయ ఉత్పత్తుల ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోబో (Industrial robot)అనుసంధానంతో పనిచేసే ఓ మెషీన్‌.. మనిషిని, కూరగాయలతో ప్యాక్‌ చేసిన పెట్టెతో పోల్చుకోవడంలో విఫలమైంది. ఈ క్రమంలో ఓ రోబో.. దగ్గర్లో ఉన్న వ్యక్తిని పెట్టెలా భావించి అతణ్ని బలంగా లాగి బెల్ట్‌పై పడేసింది. అది తన మరచేతులతో మనిషిని గట్టిగా పట్టుకున్నప్పుడు అతడి ఛాతి, ముఖం ఛిద్రమయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఇక ఈ కంపెనీ ప్యాకింగ్‌ విభాగంలో పారిశ్రామిక రోబోలను అమార్చగా ఇవి కూరగాయలతో నింపిన పెట్టెలను తీసి కన్వేయర్‌ బెల్ట్‌పై వేయాల్సి ఉంటుందని సందరు కంపెనీ యాజామాన్యం తెలిపింది.

Also read :తెలుగు సినీ జర్నలిస్టుల మద్దతుపై స్పందించిన రష్మిక.. పోస్ట్ వైరల్

అలాగే రెండు రోజుల క్రితమే రోబో సెన్సర్‌లో లోపం ఉందని ఫ్యాక్టరీ సిబ్బంది గుర్తించినట్లు పేర్కొంది. దాన్ని బాగు చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని.. రోబోలోని లోపం కారణంగానే మనిషిని ఒక బాక్స్‌లా గుర్తించిందని వివరణ ఇచ్చింది. అయితే దానిని రిపేర్ చేస్తున్న వ్యక్తినే అది పొరబడటం ఆందోళన కలిగించిందని వివరించారు. ఇక ఇటీవలే దక్షిణ కొరియాలోనే ఓ మోటార్ వెహికల్ తయారు చేస్తుండగా ఆ సంస్థలో ఉన్న రోబో ఓ కార్మికుడిని తీవ్రంగా గాయపరిచింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nandyala Incident మరో పదిరోజుల్లో పెళ్లి.. ఇంతలోనే... గుండెపగిలేలా ఏడుస్తున్న కన్నతల్లి

నంద్యాల జిల్లా ఆత్మకూరలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మరో పదిరోజుల్లో పెళ్లనగా వరుడు నాగేంద్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బంధువులకు పెళ్లి పత్రికలు ఇచ్చి వస్తుండగా .. అతడి బైక్ ని బొలెరో వాహనం ఢీకొట్టింది.

New Update
Nandyala incident groom spot dead in accident

Nandyala incident groom spot dead in accident

Nandyala Incident:  మరో పదిరోజుల్లో పెళ్లనగా.. పెళ్ళికొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పారాణితో చూడాల్సిన కొడుకును ప్రాణం లేకుండా చూసిన ఆ కన్నతల్లి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. పెళ్లి భాజాలతో కళకళలాడుతూ ఉండాల్సిన కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఈ విషాదకరమైన ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూర్ పట్టణం ఏకలవ్య నగర్ లో చోటుచేసుకుంది. 

పెళ్లి పత్రికలూ ఇవ్వడానికి వెళ్ళి.. 

అయితే ఆత్మకూరు కి చెందిన నాగేంద్ర అనే యువకుడు ఈ నెల 30న తన పెళ్లి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో బంధువులందరికీ పెళ్లి పత్రికలు ఇస్తూ వస్తున్నాడు. అలా వరుడు నాగేంద్ర లింగాల గ్రామంలోని తన బంధువులకు పత్రిక ఇచ్చేందుకు వెళ్ళాడు. పత్రిక ఇచ్చిన తర్వాత తిరిగి ఆత్మకూర్ కి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నాగేంద్ర వెళ్తున్న బైక్ ని బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు నాగేంద్ర అక్కడిక్కడే మృతి చెందాడు. మరో పది రోజుల్లో పెళ్లి చేసుకొని.. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాల్సిన కొడుకు..  ఇక లేడని తెలియడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగింది. అతడి కన్న తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

telugu-news | latest-news | crime | nandyala-district-atmakuru 

Advertisment
Advertisment
Advertisment