Kadapa Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో నలుగురు మృతి

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు- ఆటో రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో ఆరుగరికి గాయాలయ్యాయి.

New Update
Kadapa Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో నలుగురు మృతి

Kadapa District Road Accident: కడప జిల్లా ఎర్రగుంట్ల (Errguntla)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం ఎర్రగుంట్ల - పొద్దుటూరు రోడ్డులో ఎస్వీ కళ్యాణ మండపం (SV Kalyana Mandapam) వద్ద ఆర్టీసీ బస్సు- ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో అరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను కడప జిల్లా ఆజాద్‌నగర్ కాలనీ (Azadnagar Colony)కి చెందిన మహమ్మద్ (25), హసీనా(25), అమీనా(20), షాకీర్(10) గుర్తించారు. ప్రొద్దుటూరు నుంచి మల్లెల (Mallela) వెళ్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ప్రొద్దుటూరు (Proddatur) ప్రభుత్వాస్పత్రి (Govt Hospital)కి.. మృతులను పోస్ట్‌పార్టం నిమిత్తం తరలించారు. నలుగురు ఒక్కసారి మరణించడంతో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొన్నది. నలుగురు మృతులతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read: తెలంగాణలో స్కూల్‌బస్సు బోల్తా.. ఎంత మంది విద్యార్థులకు గాయాలయ్యాయంటే..?

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరు- కడపకు చెందిన 11 మంది.. ప్రొద్దుటూరు (Proddatur) నుంచి మల్లెలకు ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో లారీని క్రాస్ చేయబోతుండగా.. ఎర్రగుంట్ల నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మహిళా డ్రైవర్‌తో సహా ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి (Four died) చెందారని పోలీసులు తెలిపారు. జమ్మలమడుగు (Jammalamadugu ) డీఎస్పీ నాగరాజు (DSP Nagaraju), ఎర్రగుంట్ల తహసీల్దార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో డ్రగ్స్ మరోసారి కలకలం.. కీలక నిందితులు అరెస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు