ఇరాన్ అధ్యక్షుడి మరణం..బంగారం, పెట్రోల్ ధరలు పెరిగే ప్రమాదం?

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది.దీంతో బంగారం,పెట్రోలు ధరలపై అధిక ప్రభావం చూపుతోంది.

New Update
ఇరాన్ అధ్యక్షుడి మరణం..బంగారం, పెట్రోల్ ధరలు పెరిగే ప్రమాదం?

ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ గత ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అజర్‌బైజాన్ నుండి తిరిగి వస్తుండగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరాప్టోలాహియాన్, అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, కొంతమంది అధికారులు కూడా మరణించారు. క్రాష్ సైట్ వద్ద అన్ని మృతదేహాలు లభించటంతో, ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపింది.

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతితో అంతర్జాతీయ మార్కెట్లు సోమవారం ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ముడి చమురు ధరలు పెరిగాయి. అంటే అదే రోజున డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 0.41%, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.48% పెరిగింది. భారతదేశం విషయానికొస్తే, దాని ముడి చమురు అవసరాలలో 85 శాతం దిగుమతి చేసుకుంటుంది. ఇది ఇరాన్ నుండి గణనీయమైన మొత్తంలో ముడి చమురును కూడా దిగుమతి చేసుకుంటుంది. అదేవిధంగా, డ్రై ఫ్రూట్స్, కెమికల్స్, గ్లాస్‌వేర్‌తో సహా అనేక ఉత్పత్తులను ఇరాన్ నుండి భారతదేశం దిగుమతి చేసుకుంటోంది.

అదేవిధంగా, బాస్మతి బియ్యం భారతదేశం నుండి ఇరాన్‌కు పెద్ద మొత్తంలో ఎగుమతి అవుతుంది. ఇరాన్‌లో అనిశ్చితి కారణంగా ప్రస్తుతం ముడి చమురు ధరలు అస్థిరంగా ఉన్నాయి. దీంతో సామాన్యులు వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి.ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. తదనంతరం, పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపడంతో, డిమాండ్ పెరిగింది మరియు బంగారం ధర పెరగడం ప్రారంభించింది. అందువల్ల ఇరాన్‌లో స్థిరమైన నాయకత్వం ఏర్పడే వరకు బంగారం ధర తగ్గదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

గత పది రోజులుగా ప్రపంచం మొత్తం టారీఫ్ ల వార్ తో దడదడలాడిపోతోంది. టారీఫ్ లతో దాదాపు అన్ని దేశాలనూ బెంబేలెత్తించారు. అయితే రెండు రోజు క్రితం ఈ సుంకాలకు 90 రోజుల బ్రేక్ ను కల్పిస్తూ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇందులో చైనాను మాత్రం కలపలేదు. దీంతో మిగతా దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నా చైనాతో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సుంకాల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది అమెరికా. 

ఫోన్లు, కంప్యూటర్ల మీద..

అమెరికా మీద చైనా 125 శాతం, అమెరికా 145 శాతం సుంకాలను విధించుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తుల మీద 145 ఉంటాయి కానీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మీద కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు సంబంధించి ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. 

యాపిల్ కంపెనీకి ఊరట..

సుంకాల పెంచడంతో స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు ధరలు పెరుగుతాయని వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అమెరికా వాసులు స్టోర్లకు కూడా పరుగెత్తారు. కానీ ఇప్పుడు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ప్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తుల మీద ప్రతీకార సుంకాలను పెంచాలంటే అవన్నీ అమెరికాలోనే తయారు చేయాలి. కానీ అక్కడ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి తయారీ కంపెనీలను పెట్టడం కూడా  కుదరదు.  దీనికి కొన్నేళ్ళు సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికా సుంకాల నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయిన యాపిల్ కంపెనీ...ఇప్పుడు తాజా నిర్ణయంతో హమ్మయ్య అనుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 today-latest-news-in-telugu | usa | china | trump tariffs | apple | i-phone

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

Advertisment
Advertisment
Advertisment