Rishabh Pant: ఆ రోజే చచ్చిపోతాననుకున్నా.. ఏడు నెలలు నరకం చూశా! కారు యాక్సిడెంట్ నుంచి కోలుకుని ఐపీఎల్, టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో అవకాశం దక్కించుకోవడంపై రిషబ్ పంత్ ఆనందం వ్యక్తం చేశాడు. గాయాల తీవ్రతతో ప్రాణాలతో ఉంటాననుకోలేదు. మళ్లీ క్రికెట్ ఆడుతానని అసలే ఊహించలేదు. ఏడు నెలలను నరకం చూశానంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. By srinivas 28 May 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Rishabh Pant: టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ తర్వాత మళ్లీ బతికి బయటపడతాననుకోలేదంటూ ఎమోషనల్ అయ్యాడు. గతేడాది కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ యేడాది విరామం తర్వాత ఐపీఎల్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే తాజాగా ఐపీఎల్ సీజన్ ముగియడంతో జూన్ లో ప్రారంభకాబోయే 2024 టీ 20 వరల్డ్ కప్ పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్.. తాను ఎదుర్కొన్న స్ట్రగుల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ప్రాణాలతో ఉంటానో లేదో అనిపించింది.. ఈ మేరకు గతేడాది డిసెంబర్ 30న పంత్‌కు యాక్సిడెంట్ జరిగింది. దీంతో కాలు లిగమెంట్ చిరిగి పోవడంతోపాటు చేయి, వీపుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు తెలిపాడు. అలాగే యాక్సిడెంట్ కారణంగా గతేడాది క్రికెట్‌కు దూరమైన తాను ఐపీఎల్ రాణించడంతోపాటు టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కావడం సంతోషం ఉందన్నాడు. 'నాకు జరిగిన యాక్సిడెంట్ కారణంగా చాలా రోజులు బాధపడ్డాను. ఆ యాక్సిడెంట్ నా జీవితంలో చాలా నేర్పింది. తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలతో ఉంటానో లేదో అనిపించింది. ఏడు నెలల పాటు భరించలేని నొప్పి కారణంగా బ్రష్ కూడా చేసుకోలేదు. చాలా నరకంగా అనిపించింది. మళ్లీ క్రికెట్ ఆడుతానని అసలే ఊహించలేదు' అంటూ చెప్పుకొచ్చాడు. #car-accident #rishabh-pant మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి