మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి.. రెండు ఫైళ్లపై సంతకం

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియం వేదికగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. 6 గ్యారంటీలు, రజినీకి ఉద్యోగం ఫైళ్లపై సంతకం చేశారు. 

New Update
మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి.. రెండు ఫైళ్లపై సంతకం

Revanth Keeps His Promise : తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM)గా ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియం వేదికగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన  ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. 6 గ్యారంటీలు, రజినీకి ఉద్యోగంపై సంతకం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. అంతకుముందు కాంగ్రెస్‌ కార్యకర్తల కేరింతలు మధ్య ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో కలిసి ప్రత్యేక వాహనంలో రేవంత్‌ వేదిక వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

Also read :మీ రేవంత్ అన్నగా నిలబడతా..రేపటి నుంచే ప్రజా దర్బార్.

మొదట సీఎంగా రేవంత్‌రెడ్డి (Revanth Reddy).. ఆ తర్వాత మంత్రులతో గవర్నర్‌ ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలకు ఈరోజు స్వేచ్ఛ వచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తాం. సంక్షేమ, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం. మేం పాలకులం కాదు.. మీ సేవకులం.

కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా. విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తాం. తెలంగాణ ఆషామాషీగా ఏర్పడిన రాష్ట్రం కాదు. పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ త్యాగాలే పునాదులుగా ఏర్పడింది. కాంగ్రెస్‌ పార్టీ సమిధగా మారి తెలంగాణ ఇచ్చింది. పదేళ్లుగా నిరంకుశత్వాన్ని ప్రజలు మౌనంగా భరించారన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు