Revanth Reddy : రేవంత్‌ దూకుడు.. నేడు సొంత నియోజకవర్గంలో రూ.3,961 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన తొలిసారి తన నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.3,961 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

New Update
CM Revanth Reddy: మోడీ కేసులకు భయపడతానా?..  సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy Kodangal Tour : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) డిసెంబర్‌లో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా బుధవారం తన సొంత నియోజకవర్గం కొడంగల్‌(Kodangal) లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో సహా రూ.3,961 కోట్లతో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇందులో రూ.2,945 కోట్లతో కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని(Lift Irrigation Scheme) స్టార్ట్ చేయడం కూడా ఉంది. కొడంగల్ నియోజకర్గాన్ని వచ్చే ఐదేళ్లలో అన్ని విధాలా అభివృద్ధి చేసేలా రేవంత్‌ ప్లాన్‌ చేస్తున్నారు. గత డిసెంబర్ 29న వికారాబాద్ కలెక్టర్ నేతృత్వంలో కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కాడా) ని ఏర్పాటు చేశారు.

publive-image

ఇవాళ ఆయన ప్రారంభించనున్న అభివృద్ధి పనుల వివరాలు( శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవం):
--> R&B అతిథి గృహం (రూ. 6.8 కోట్లు)

--> సింగిల్‌లేన్‌ హైవే విస్తరణ (రూ. 262 కోట్లు)

--> డబుల్‌లేన్‌ రోడ్ల (రూ. 54 కోట్లు)

--> వంతెనలు (రూ. 54 కోట్లు)

--> బిటి రోడ్లు (రూ. 27.86 కోట్లు)

--> హైలెవల్ వంతెనలు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం (రూ. 213.20 కోట్లు)

--> దూద్యాల మండలం హస్నాబాద్ గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్ (రూ. 3.99 కోట్లు).

--> NREGS కింద CC రోడ్లు (40 కోట్లు)

--> విద్యాశాఖకు సంబంధించి హాస్టల్‌ భవనం (రూ. 5 కోట్లు)

--> మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల భవనం (రూ. 25 కోట్లు)

--> బీసీ సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాల, నీటూరులోని జూనియర్‌ కళాశాల (రూ. 25 కోట్లు)

--> దౌల్తాబాద్‌లో జూనియర్‌ కళాశాల (రూ. 7.13 కోట్లు)

--> బొమరస్‌పేటలోని జూనియర్ కళాశాల (రూ. 7.13 కోట్లు)

--> మద్దూరు ఎస్సీ సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (రూ. 20 కోట్లు)

--> కొడంగల్‌లో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (రూ. 25 కోట్లు)

--> కోసిగిలో మహిళల డిగ్రీ కళాశాల (రూ. 11 కోట్లు) .

వీటితో పాటు చంద్రకల్ గ్రామంలో ప్రభుత్వ పశువైద్య కళాశాల, కోస్గిలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల (రూ. 30 కోట్లు)కు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్ సెక్టార్‌(Medical & Health Sciences Sector) లో 50 సీట్లతో కూడిన మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఫిజియోథెరపీ కాలేజీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 220 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడం లాంటి పనులను రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Also Read : మేడారం స్పెషల్.. విద్యార్థులకు 5 రోజులు సెలవులు.. డేట్స్ ఇవే…!!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు