Telangana: జిల్లాల పునర్విభనపై సీఎం కీలక ప్రకటన జిల్లాల పునర్విభజన చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఓ ఇంటర్వ్యూలో చేసిన ప్రకటన రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఒక్కో నియోజకవర్గం రెండు మూడు జిల్లాల్లో ఉండడం ఇబ్బందికరంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో జిల్లాల సంఖ్య తగ్గడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. By srinivas 07 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలు, నియోజక వర్గాలు, మండలాలు ఏర్పాటు విధానంపై పునర్విచారణ చేయబోతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పేర్లు చెప్పలేని పరిస్థితి.. ఈ మేరకు ఇటీవలో ఓ సమావేశంలో జిల్లాల విభజనపై మాట్లాడిన ఆయన.. ‘తెలంగాణలో 33 జిల్లాల పేర్లు చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఒక జిల్లాలో మూడునాలుగు జడ్పీటీసీలు మాత్రమే ఉన్నాయి. జడ్పీ సమావేశం నిర్వహిస్తే ముఖముఖాలు చూసుకోవటం తప్ప మరేమీ ఉండట్లేదు. ఒక ఎంపీ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. అవి కూడా మూడునాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఆ ఎంపీ ఏదైనా చేయాలంటే ఆ మూడునాలుగు జిల్లాల కలెక్ట ర్లు, ఎస్పీలతో మాట్లాడాల్సి వస్తుంది. 33 జిల్లాల పేర్లు గుర్తుపెట్టుకోవటం కూడా కష్టమవుతోంది. జిల్లాలు, మండలాల విభజనపై బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తాం. దీనికోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో కమిషన్ వేస్తాం. ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకొంటాం’ అని ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి : Tamannaah: బోల్డ్ షోతో రెచ్చిపోయిన తమన్నా.. సాఫ్ట్ పోర్న్ స్టార్ అంటూ దారుణమైన ట్రోలింగ్ ఇక సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాల సంఖ్య తగ్గబోతుందనే ప్రచారం ఊపందుకుంది. తక్కువ జనాభా ఉన్న జిల్లాలను పాత జిల్లాల్లోనే కలిపేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కమిటీ ఏర్పాటు తర్వాత వచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం ఉండబోతుందని, ఏ ఏ జిల్లాలను కలిపేసే అవకాశం ఉందనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పలు ఉమ్మడి జిల్లాల్లో నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి: ఉమ్మడి నల్గొండ జిల్లా: తుంగతుర్తి-నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి మునుగోడు-యాదాద్రి భువనగిరి, నల్గొండ నకిరేకల్-నల్గొండ, యాదాద్రి భువనగిరి ఆలేరు-యాదాద్రి, జనగామ ఉమ్మడి కరీంనగర్ జిల్లా: హుస్నాబాద్: సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ మానకొండూరు: కరీంనగర్, సిద్దిపేట హుజూరాబాద్: కరీంనగర్, హనుమకొండ ధర్మపురి-పెద్దపల్లి, జగిత్యాల చొప్పదండి-కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల వేములవాడ-సిరిసిల్ల, జగిత్యాల ఉమ్మడి వరంగల్ జిల్లా: జనగామ-జనగామ, సిద్దిపేట, పాలకుర్తి: జనగామ, మహబూబాబాద్ స్టేషన్ ఘన్ పూర్-జనగామ, హనుమకొండ వర్ధన్నపేట-వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి ఉమ్మడి మెదక్ జిల్లా: దుబ్బాక-సిద్దిపేట, మెదక్ గజ్వేల్-సిద్దిపేట, మెదక్ నర్సాపూర్-మెదక్, సంగారెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా: కల్వకుర్తి-రంగారెడ్డి, నాగర్ కర్నూల్ కొడంగల్-నారాయణపేట, వికారాబాద్ మక్తల్-వనపర్తి, నారాయణపేట ఉమ్మడి రంగారెడ్డి: ఎల్బీనగర్, చేవెళ్ల-రంగారెడ్డి, వికారాబాద్ పరిగి-వికారాబాద్, మహబూబ్ నగర్ #telangana #revanth #redistribution #districts మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి