Retirement Plan : ఒక్కసారి మూడులక్షలు పెడితే చాలు.. నెలకు 31 వేల రూపాయల పెన్షన్.. 

మీరు 25 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరితే, తరువాత ఐదేళ్ళలో 3 లక్షలు పొదుపు చేసి..ఆ మొత్తాన్ని తరువాతి 20 ఏళ్లకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి. అప్పుడు వచ్చిన మొత్తాన్ని fd చేసుకుంటే మీకు 50 ఏళ్ల వయసు నుంచి నెలకు 30 వేల రూపాయలు వస్తాయి. పూర్తి లెక్క ఇక్కడ చూడండి

New Update
Retirement Plan : ఒక్కసారి మూడులక్షలు పెడితే చాలు.. నెలకు 31 వేల రూపాయల పెన్షన్.. 

Retirement Plan For Youth : ఇప్పటి యువత(Youth) భవిష్యత్ కోసం చాలా ఎక్కువ ఆలోచనలు చేస్తోంది. ఉద్యోగంలో చేరిన వెంటనే.. రిటైర్మెంట్ కోసం ఎలా డబ్బు పొదుపు చేసుకోవాలి అనే విషయాన్ని ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. దీనికోసం  కొంతమంది నెలవారీ పొదుపు చేయడం(EMI) ప్రారంభిస్తే, మరికొందరు పెన్షన్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పెట్టుబడి ఎంపికలలో రాబడి లెక్కలు వేటికవి భిన్నంగా ఉంటాయి.  మీరు స్టాక్ మార్కెట్ గురించి చూసినట్లయితే..  రాబడి 200-1000 శాతం వరకు ఉండొచ్చు. ఒక్కోసారి అసలుకే ఎసరు రావచ్చు.  ఊరికే అలా.. స్టాక్‌పై బెట్టింగ్ చేయడం ద్వారా రాబడిని అంచనా వేయడం అంత సులభం కాదు. మీరు దీన్ని స్థిర ఆదాయంగా చూడలేరు. కానీ ఈ రోజుల్లో చాలామంది  మార్కెట్‌తో పరోక్షంగా అనుసంధానించిన నిధులను స్థిర ఆదాయంగా చూడటం ప్రారంభించారు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక పద్ధతి గురించి చెప్పుకోబోతున్నాం. దీని సహాయంతో మీరు ఈ రోజు కేవలం రూ. 3 లక్షలు పెట్టుబడి ఒకేసారి పెట్టి.. మీరు రిటైర్ అయ్యే వరకు దాని గురించి మరచిపోండి. మీ రిటర్న్ మీ నెలవారీ పెన్షన్‌గా(Retirement Plan) ఎలా ఉపయోగపడుతుందో అప్పుడు అర్ధం అవుతుంది. 

అలా ఎలా?
నెలవారీ పెన్షన్‌ను సెటప్ చేయడానికి, మీరు రాబోయే 20 సంవత్సరాలకోసం ఈరోజే రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాలి. మీరు ఈ పెట్టుబడిని(Retirement Plan) ఏదైనా పెన్షన్ ఫండ్‌(Pension Fund) లో చేయవలసిన అవసరం లేదు.  కానీ మ్యూచువల్ ఫండ్‌(Mutual Fund) లో. ఏదైనా అత్యుత్తమ ఇండెక్స్ ఫండ్‌ని ఎంచుకోవడం ద్వారా మీరు మీ డబ్బును డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు సులభంగా 12-15 శాతం రాబడిని ఇస్తాయి. సంవత్సరానికి 30-40% వరకు రాబడిని ఇచ్చే ఫండ్‌లు కూడా కొన్ని ఉన్నాయి.

మీ వయస్సు 20-25 సంవత్సరాల మధ్య ఉంటే..  మీరు తదుపరి 20 సంవత్సరాలకు అంటే 40-45 సంవత్సరాల వయస్సు వరకు పెట్టుబడిని  పెట్టారని అనుకుందాం. మీరు మ్యూచువల్ ఫండ్ నుండి 15% సగటు రాబడిని పొందినట్లయితే, తదుపరి 20 సంవత్సరాలలో మీరు రూ. 49,09,961 (సుమారు 49 లక్షల 10 వేలు) ఫండ్‌ను సృష్టిస్తారు. ఈ డబ్బును మీరు రిటైర్ అయ్యాక విత్‌డ్రా చేసి FDలో పెట్టండి.

Also Read: తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే.. 

స్థిర ఆదాయం..
FD నుండి(Retirement Plan) రాబడి 7 నుండి 8 శాతం మధ్య ఉంటుంది. మీరు FDలో 7.5% రాబడి పొందారని అనుకుందాం, అప్పుడు మీరు సంవత్సరానికి రూ. 3,78,737 వడ్డీని పొందుతారు, అది నెలకు రూ. 31,593 (31.5 వేలు) అవుతుంది. అంటే మీరు సులభంగా నెలకు రూ.31,500 సంపాదించగలరు.

అయితే, ఈ లెక్క మీపెట్టుబడిపై ఫండ్స్ నుంచి 12 - 15 శాతం మధ్యలో రాబడి రావచ్చని అంచనాతో వేసింది. ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా రిస్క్ తో కూడినది. అందువల్ల.. మీరు ఇన్వెస్ట్ చేసిన తరువాత ఎప్పటికప్పుడు మీ ఫండ్స్ పనితీరును చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే, మీరు పెట్టిన 3 లక్షల రూపాయల పెట్టుబడిని ఎప్పుడూ మధ్యలో వెనక్కి తీసుకోకూడదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఇన్వెస్ట్ చేసే ముందు కచ్చితంగా మీ ఆర్థిక సలహాదారుని సూచనలు తీసుకోవడం తప్పనిసరి అని మర్చిపోకండి. 

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు