Resourceful Automobile IPO: కేవలం 8 మంది ఉద్యోగులతో ఇంటర్నేట్‌ను షేక్ చేస్తున్న కంపెనీ..

రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్‌ అనే కంపెనీ ఇప్పుడు ఇంటర్నేట్ సెన్షేషన్‌గా మారింది. స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజ్ సెగ్మెంట్‌లో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ ఏకంగా 419 రెట్లు ఓవర్‌ స్రైబ్‌ అయ్యింది. రూ.12 కోట్ల ఐపీఓకు రూ.4,800 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి.

New Update
Resourceful Automobile IPO: కేవలం 8 మంది ఉద్యోగులతో ఇంటర్నేట్‌ను షేక్ చేస్తున్న కంపెనీ..

చాలావరకు కంపెనీలు నిధుల సమీకరణ కోసం తరచుగా ఐపీఓకు(IPO)కు వస్తుంటాయి. పేరుమోసిన కంపెనీలు కూడా లిస్టింగ్ చేసే సమయాల్లో నష్టాలను చవిచూస్తుంటాయి. మరోవైపు పేరు తెలియని కంపెనీలు కూడా మంచి లాభాలను పొందుతుంటాయి. అయితే ఢిల్లీ వాసులకు పెద్దగా తెలియని ఓ కంపెనీ ఇప్పుడు ఇంటర్నేట్ సెన్షేషన్‌గా మారింది. స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజ్ సెగ్మెంట్‌లో ఐపీఓకు వచ్చిన రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ కంపెనీ ఇప్పుడు ఏకంగా 419 రెట్లు ఓవర్‌ స్రైబ్‌ అయ్యింది. రూ.12 కోట్ల ఐపీఓకు రూ.4,800 కోట్ల విలువైన బిడ్లు దాఖలవ్వడం మరో విశేషం.

Also Read: కవిత బెయిల్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఇక వివరాల్లోకి వెళ్తే.. 2018లో రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్‌ అనే కంపెనీ ఏర్పాటైంది. సాహ్ని ఆటోమొబైల్ అనే బ్రాండ్‌పై వ్యాపారం చేస్తోంది. ఈ కంపెనీకి యమహా డీలర్ షిప్ ఉంది. మోటార్ సైకిళ్లు, స్కూటర్ల అమ్మకాలు, సర్వీసింగ్ వంటి సేవలు అందిస్తోంది. అయితే ఈ కంపెనీకి ఢిల్లీలో రెండే షోరూమ్‌లు ఉన్నాయి. కేవలం 8 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మరో రెండు షోరూమ్‌లు తెరవడంతో పాటు.. రుణాలు, నిర్వహణ ఖర్చుల కోసం.. ఐపీఓ నుంచి సమీకరించిన నిధులను వినియోగించుకుంటామని కంపెనీ తన ఐపీఓ పత్రాల్లో చెప్పింది.

Also Read: 5 నెలల తర్వాత నేడు హైదరాబాద్‌కు కవిత.. స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు!

అయితే ఐపీఓలో భాగంగా 10.25 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటి రూ.117 చొప్పున సబ్‌స్క్రిప్షన్‌కు ఉంచింది. ఆగస్టు 22 నుంచి 26 వరకు సబ్‌స్క్రిప్షన్ కొనసాగింది. సబ్‌స్క్రిప్షన్ ముగిసేనాటికి 40.76 కోట్లు దాఖలయ్యాయి. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్‌ పోర్షన్ 315.61 రేట్లు సబ్‌స్కైబ్‌ అయ్యింది. మరో వైపు రిటైల్ ఇన్వెస్టర్లు ఏకంగా 496.22 రేట్లకు సమానంగా బిడ్లు దాఖలవ్వడం విశేషం. ఇక ఆగస్టు 29న బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై ఈ కంపెనీ లిస్ట్‌ కానుంది. ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో ఓ IPOకు అసాధారణ స్థాయిలో సబ్‌స్క్రిప్షన్ రావడం ఇప్పుడు చర్చనీయమైంది. రూ.12 కోట్ల ఐపీఓకు రూ.4,800 కోట్ల మైలైజ్‌ అంటూ సరదాగా నెటీజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు