రేయిన్‌ ఎఫెక్ట్‌ నిండుకుండలా జలాశయాలు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో జుక్కల్‌ లోని నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు జలకళ సంతరించుకుంది. దీంతో అధికారులు నిజాంసాగర్‌ గేట్లు ఎత్తిని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

New Update
రేయిన్‌ ఎఫెక్ట్‌ నిండుకుండలా జలాశయాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భారీగా వరద పోటెత్తడం వల్ల అనేక ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షానికి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో 5 గేట్లు ఎత్తిన అధికారులు నిజాం సాగర్‌ ప్రాజెక్టు నుంచి 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి 35,000 క్యూసెక్కుల నీరు మంజీరా నదికి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని వివిధ జలాశయాలు నిండుకుండలా మారాయి. నాగార్జున సాగర్, కడెం ప్రాజెక్ట్‌, శ్రీశైలం ప్రాజెక్ట్‌, కాళేశ్వరం ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులు సైతం నిండుకుండలా మారాయి. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలపడంతో ముందుస్తుగా అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టుల గేట్లు వదిలి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మరోవైపు హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్‌ సాగర్‌ ప్రాజెక్టు గెట్లు సైతం ఎత్తిన అధికారులు మూసికి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఈ వరదతో మూసి ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉండటంతో మూసీ నది పరివాహక ప్రాంత వాసులను జీహెచ్‌ఎంసీ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలు, వర్షాలు వచ్చే అవకాశం ఉందని నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు,.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Fire accident : హైవేపై కారులో మంటలు..సంఘటన సమయంలో ఆరుగురు...

కామారెడ్డి మండలం క్యాసంపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ అప్రమత్తమవడంతో అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే క్రమంగా మంటలు వ్యాపించడంతో కారు మొత్తం దగ్ధమైంది.

New Update
Fire accident

Fire accident

Fire accident  : కామారెడ్డి మండలం  క్యాసంపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది.  క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై వెళ్తున్న స్కార్పియో కారులో మంటలు చెలరేగాయి. కారులో పొగలు రావడాన్ని గమనించి కారును డ్రైవర్‌ నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది,  డ్రైవర్‌ అప్రమత్తమవడంతో అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.

Also Read : మరో నిర్భయ..నోట్లో గుడ్డలు కుక్కి ..కన్న కొడుకుల ముందే తల్లిపై గ్యాంగ్ రేప్!

శనివారం తెల్లవారుజామున క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై స్కార్పియో కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే కారును నిలిపి, అందులో ఉన్న వారందరిని అప్రమత్తం చేశారు. దీంతో అంతా కిందికి దిగిపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. అయితే క్రమంగా మంటలు వ్యాపించడంతో కారు మొత్తం దగ్ధమైంది.

Also read: Drugs: లేడీ కానిస్టేబుల్ కారులో డ్రగ్స్.. తర్వాత ఏం జరిగిందంటే?

Also read :  నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్తలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.కారు భువనగిరి నుంచి బడాపహడ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయానిస్తున్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని తెలిపారు.

Also read :  పెళ్లైన తెల్లారే జంప్.. ఇప్పటికే ముగ్గురితో మూడు ముళ్లు!

Also Read : అయ్యో తల్లి.. నవరాత్రుల కోసం ప్లాన్.. పీరియడ్స్ రావడంతో సూసైడ్!

Advertisment
Advertisment
Advertisment