Mangoes: భోజనంతో పాటు మామిడిపండ్లు తింటున్నారా..?. ఇవి గుర్తుంచుకోండి..!!

వేసవి సీజన్‌లో పండిన మామిడిపండ్లు తింటే శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి, ఫైబర్, ప్రోటీన్లు, పోషకాలు అందుతాయి. కానీ ఈ పండు తినేటప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉంటే తీవ్ర అనారోగ్యానికి గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ జాగ్రత్తలు తెలుసుకుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Mango Price : రికార్డు ధర పలుకుతున్న ఉలవపాడు బంగినపల్లి మామిడి!

Mangoes: వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సీజన్‌లో ఆహారం విషయంలో అజాగ్రత్త కూడా అనేక సమస్యలను పెంచుతుందని నిపుణులు అంటున్నారు. మామిడికాయల సీజన్ వచ్చింది. ఈ సీజన్‌లో పండిన మామిడిపండ్లు తినడానికి ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. వీటిని తినేందుకు కొందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మామిడి చాలా ప్రయోజనకరమైన పండు. శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి, ఫైబర్, ప్రోటీన్లతో సహా అనేక రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. అయితే.. మామిడి పండు తినేటప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉంటే తీవ్ర అనారోగ్యానికి గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా విషం వచ్చే ప్రమాదం ఉందటున్నారు. మార్కెట్ నుంచి మామిడిని కొనుగోలు చేసినప్పుడు.. కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడిపండు తినకుండా జాగ్రత్త వహించండి:

  • మామిడిపండ్లు చాలా రుచిగా ఉంటాయి. అయితే.. దీనిని తినడంలో అజాగ్రత్త ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. ముఖ్యంగా మార్కెట్‌లో లభించే ఏదైనా పండ్లు ఆరోగ్యానికి తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి. వాస్తవానికి.. మార్కెట్‌లో లభించే పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ మానవ శరీరానికి ప్రమాదకరమైన రసాయనం.
  •  పండ్లను పండించడంలో కాల్షియం కార్బైడ్ వాడకం ఇటీవలి పెరిగింది. దీని కారణంగా.. అనేక వ్యాధులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. కాల్షియం కార్బైడ్‌ను నీటిలో కలిపినప్పుడు.. ఎసిటిలీన్ వాయువు విడుదలవుతుంది.. ఇది పండ్లను పండించడానికి ఉపయోగిస్తారు. కాల్షియం కార్బైడ్, ఎసిటిలీన్ వాయువు రెండూ ఆరోగ్యానికి ప్రమాదకరమని అనేక పరిశోధనలు తేలింది.
  • పండ్ల ఉత్పత్తి పరిశ్రమలో పనిచేసే కార్మికులు కాల్షియం కార్బైడ్‌కు ఎక్కువగా గురికావడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా.. వారు పల్మనరీ ఎడెమా, అంటే ఊపిరితిత్తులలో ద్రవం చేరడం, కార్డియాక్ అరెస్ట్, పెద్దప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులతో బాధపడవచ్చు.
  • కాల్షియం కార్బైడ్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఏదైనా పండును తినడానికి ముందు కనీసం అరగంట పాటు నీటిలో ఉంచి సరిగ్గా శుభ్రం చేసుకోని తినాలని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలపై కూడా శ్రద్ధ పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:  పుచ్చకాయను ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HariHaraVeeraMallu Release: వీరమల్లు విడుదల డౌటే..? పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మే 9న విడుదల కానుండగా.. ఇంకా షూటింగ్ పనులు పెండింగ్ ఉన్నట్లుగా సమాచారం. పవన్ ఆరోగ్యం, అలాగే కొడుకుకు ప్రమాదం జరగడం ఆలస్యానికి కారణమని టాక్.

New Update

HariHaraVeeraMallu Release:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన  'హరిహర వీరమల్లు' మళ్ళీ పోస్ట్ ఫోన్ కానున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ళ క్రితం మొదలుపెట్టిన ఈ సినిమాకు ఇంకా థియేటర్ మోక్షం కలగడం లేదు. మే 9న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించగా.. షూటింగ్ పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో మళ్ళీ వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వారం పవన్ కు సంబంధించిన షూట్ పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయన కుమారుడు అగ్ని ప్రమాదానికి గురవడం, పవన్ ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో  షెడ్యూల్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో అనుకున్న టైంకి మూవీని  రిలీజ్ చేయగలమా? లేదా అనే  టెన్షన్ లో ఉన్నారు మేకర్స్. మరోవైపు  ఫ్యాన్స్ కూడా  తీవ్ర నిరాశ చెందుతున్నారు.  ఇప్పుడు రిలీజ్ కాకపోతే..? ఇకపై  'హరిహరవీరమల్లు' విడుదల డౌటే? అని కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. 

Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

ఇప్పటికే మూడు సార్లు

ఇప్పటికే ఈ చిత్రాన్ని మూడు సార్లు పోస్ట్ ఫోన్ చేశారు.  మొదటగా 2021లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా  2022 మార్చి 28కి పోస్ట్ ఫోన్ చేశారు. ఆ తర్వాత  2023, 2024లో పవన్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో 2025 మార్చి 28కి రిలీజ్ వాయిదా వేశారు. అయితే అప్పటికి కూడా ఈ సినిమా చూసే భాగ్యం దక్కలేదు  ఫ్యాన్స్ కి. మళ్ళీ మే 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు టాక్. 

మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై AM. రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని  క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, బాబీ డియోల్, ఎం. నాసర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిఇలా ఉంటే ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. 

cinema-news | latest-news | harihara-veeramallu-movie

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు