Ambani : హిందూ సంప్రదాయంలో వివాహ విశిష్టత గురించి వివరించిన ముఖేష్ అంబానీ వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేయడం మాత్రమే కాదని..రెండు కుటుంబాలను ఆత్మీయులుగా మార్చే సంతోషకరమైన వేడుక అని ముఖేష్ అంబానీ భావోద్వేగంతో తెలిపారు.తన చిన్న కుమారుడి వివాహం సందర్భంగా ఆశీర్వదించడానికి వచ్చిన ఆధ్యాత్మికవేత్తలు,పండితులకు కృతజ్ఞతలు తెలియజేశారు. By Bhavana 19 Jul 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Mukesh Ambani : రిలయన్స్ (Reliance) గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani), నీతా అంబానీ (Nita Ambani) దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), రాధికా మర్చంట్ (Radhika Merchant) ల వివాహం పది రోజుల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ..ఇష్టదేవతలను పూజిస్తూ తన చిన్న కుమారుడి వివాహ వేడుకను జరిపించడం చాలా సంతోషంగా ఉందని ముఖేష్ తెలిపారు. వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేయడం మాత్రమే కాదని..రెండు కుటుంబాలను ఆత్మీయులుగా మార్చే సంతోషకరమైన వేడుక అని ఆయన భావోద్వేగంతో తెలిపారు. తన చిన్న కుమారుడు వివాహం సందర్భంగా ఆశీర్వదించడానికి వచ్చిన ఆధ్యాత్మికవేత్తలు, పండితులకు అంబానీ కుటుంబం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. వివాహా వేడుకను నృత్యాలు, వెలకట్టలేనంత ఆనందంలో జరిగిందని తెలిపారు. నూతన వధువరులు అనంత్, రాధిక మర్చంట్ కు అంబానీ ఫ్యామిలీతో పాటు మర్చంట్ ఫ్యామిలీ పూర్వికుల, వేదపండితుల ఆశీర్వచనాలు ఎల్లవేళలా ఉండాలని..వారి జీవితం ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో సాగిపోవాలని ముఖేష్ అంబానీ కోరుకున్నారు. Mukesh Ambani explains the significance of a traditional Hindu marriage as the most important sanskaar in a person's life connecting her/him to society, duty, and spirituality as he invites guests to two days of deeply immersive experience of the rich Indian culture and a… pic.twitter.com/nXxOoNgReh — Reliance Industries Limited (@RIL_Updates) July 18, 2024 రిలయన్స్ గ్రూప్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్ తో ఎంతో వైభవంగా జరిగింది. అయితే ఈ వివాహా వేడుకలో భాగంగా నూతన వధువరులను ఆశీర్వదించడానికి విచ్చేసిన పండితులు, ప్రముఖులకు ముఖేష్, నీతా దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు. సుసంపన్నమైన భారతీయ సంస్కృతి, సాంప్రదాయ హిందువుల లోతైన లీనమయ్యే రెండు రోజుల అనుభవానికి అతిథులను ఆహ్వానిస్తూ అందరికి సనాతన ధర్మంలో వివాహబంధానికి ఉన్న పవిత్రత, బాధ్యత గురించి ముఖేష్ అంబానీ చక్కగా వివరించారు. ప్రతీ వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుక వివాహమని .. ఇది ఇద్దరు వ్యక్తుల కలయికతో మొదలై రెండు కుటుంబాలు ఆ తర్వాత సమాజాన్ని కలుపుతూ ఓ ఉన్నత కుటుంబంగా మార్చే సంప్రదాయ వేడుక అని కొనియాడారు. అందరి ఆశీస్సులతో పాటు గ్రామ, ఇష్ట దేవతల మధ్య హిందూ సంప్రదాయాల్ని గౌరవిస్తూ తన కుమారుడి వివాహం ఇంత ఆనందంగా జరపడం చాలా సంతోషంగా ఉందని ముఖేష్ అంబానీ చెప్పారు. అలాగే .. అనంత్, రాధిక వైవాహిక జీవితం ఆనందంతో ..ఆయురారోగ్యాలతో ..అష్టైశ్వర్యాలతో తులతూగాలని …ఎల్లలు లేని విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ప్రముఖ వేదపండితులు, వ్యాపార దిగ్గజాలు, సెలబ్రిటీలు సైతం ముఖేష్ అంబానీ పెళ్లి ప్రాముఖ్యతను వివరిస్తుంటే అందరూ ఆసక్తిగా తిలకించారు. తన కుమారుడు పెళ్లి వేడుక ఇంత ఘనంగా జరిపించడానికి తన ఫ్యామిలీతో పాటు ఎక్కువగా తన సతీమణి నీతా అంబానీనే బాధ్యతలు తీసుకున్నట్లుగా ముఖేష్ అంబానీ వివరించారు. Also read: బంగాళాఖాతంలో వాయుగుండం…తెలంగాణ పై ఎంత ప్రభావం అంటే! Your browser does not support the video tag. #mukesh-ambani #radhika-merchant #nita-ambani #reliance-industries #anant-ambani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి