Women Waist : మహిళల నడుము సైజుకు..సంతానలేమికి సంబంధం ఉందా?

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి. మహిళల నడుము చుట్టుకొలతతో సంతానలేమికి సంబంధం ఉందని ఒక అధ్యయనం చెబుతోంది. నడుము పరిమాణంలో ఒక సెంటీమీటర్ పెరుగుదల కూడా సంతానలేమికి 3శాతం కారణం అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

New Update
Women Waist : మహిళల నడుము సైజుకు..సంతానలేమికి సంబంధం ఉందా?

Women Waist : సంతానలేమి(Infertility) అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. అయితే మహిళల నడుము(Woman Waist) చుట్టుకొలతతో సంతానలేమికి సంబంధం ఉందని ఒక అధ్యయనం చెబుతోంది. అందుకే అధిక బరువు(Over Weight) ను కంట్రోల్‌లో ఉంచుకోవాలని అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం సంతానలేమి అనేది 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సాధారణ సంపర్కం వల్ల గర్భం దాల్చడంలో వైఫల్యం ద్వారా వస్తుంది. ఈ సమస్య చాలా మంది జంటలకు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది కేవలం శారీరక సమస్యే కాదు దానివల్ల మానసిక ఒత్తిడికి కూడా గురవుతుంటారు. సంతానలేమికి చాలా కారణాలు ఉన్నాయని అధ్యయనంలో తేలింది.

బరువును నియంత్రణలో ఉంచుకోవాలి:

అధ్యయనం ప్రకారం.. నడుము చుట్టుకొలత మహిళల్లో సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ఈ అధ్యయనం 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల 3,239 మంది మహిళలపై జరిపారు. 11.1 శాతం మంది సంతానలేమితో బాధపడుతున్నారు. నడుము పరిమాణంలో ఒక సెంటీమీటర్ పెరుగుదల కూడా సంతానలేమికి 3శాతం కారణం అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. సంతానలేమి కలిగిన మహిళల్లో ఎక్కువగా రక్తపోటు, మధుమేహం ఉన్నవారే అని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో ఊబకాయం, సంతానలేమికి ఖచ్చితంగా సంబంధం ఉందని తేలింది. అందుకే బరువును నియంత్రణలో ఉంచుకోవాలని, పొట్ట దగ్గర కొవ్వును తగ్గించుకోవడానికి ప్రయత్నించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచిస్తున్నారు.

శారీరక శ్రమ:

  • ఊబకాయానికి అతి పెద్ద కారణం జీవనశైలి. ఒకే చోట కూర్చోవడం వల్ల మన బరువు పెరగడంతో పాటు నడుముపై కొవ్వు పేరుకుపోతుంది. అందుకే ప్రతిరోజూ కొంత సమయం పాటు వ్యాయామం చేయాలి.

ఆరోగ్యకరమైన ఆహారం:

  • మీ ఆహారంలో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు మొదలైనవాటిని చేర్చుకోవాలి. జంక్‌ ఫుడ్‌ తినకూడదు, చక్కెర, ఉప్పు తగిన మోతాదులోనే తీసుకోవాలి.

మంచి నిద్ర:

  • నిద్ర లేకపోవడం వల్ల కూడా ఊబకాయం బారిన పడతారు. అందుకే ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించాలి.

మానసిక ఒత్తిడి:

  • మానసిక ఒత్తిడి వల్ల హార్మోన్ కార్టిసాల్ మన శరీరంలో విడుదలవుతుంది. దీని వల్ల బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: కోపం వచ్చినప్పుడు మీరు ఎక్కువగా ఏడుస్తారా..? ఇలా ఎందుకు జరుగుతుందంటే..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు