Telangana:తెలంగాణలో తగ్గిన రాత్రి ఉష్ణోగ్రతలు..వణుకుతున్న హన్మకొండ తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగటి పూట ఎండ...రాత్రి చలితో వెదర్ విచిత్రంగా ఉంటోంది. హన్మకొండ అయితే వణికిపోతోంది. అక్కడ సడెన్ గా 6.2 డిగ్రీలు తగ్గిపోవడంతో చలి ఎక్కువ అయిపోయింది. By Manogna alamuru 25 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలోని హన్మకొండలో చలి చంపేస్తోంది. నిన్న రాత్రి అక్కడ 16 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. ఒక్కసారిగా హన్మకొండలో 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గిపోయింది. మామూలుగా అయితే అక్కడ రాత్రి పూట 22.2 ఉష్ణోగ్రల నమోదు కావాల్సి ఉంది. ఇక్క హన్మకొండలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తుండడం వల్లనే వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. Also Read: దేవరగట్టు సమరంలో వందమందికి గాయాలు హైదరాబాద్ లో కూడా సాధారణం కన్నా 1.7 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. రాజేంద్రనగర్, పటాన్ చెరులో కూడా ఉష్ణోగ్రలు పడిపోయాయి. ఆదిలాబాద్, ఖమ్మంలో కూడా ఇదే పరిస్థితి. అయితే పగలు ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోయాయి. పగలంతా వేడిగా ఉంటూ...రాత్రి పూట చలిగా ఉంటోంది. సాధారణం కన్నా 3.8 డిగ్రీలు అధికంగా 35.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. Also Read:40ల్లో ఉన్నారా… హెవీ వర్కౌట్స్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. #telangana #weather #cold #winter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి