Indigo Air Lines: చౌకగా మారనున్న విమాన ప్రయాణం..తగ్గిన ఇంధనం ధరలు

విమానంలో ప్రయాణించడం మీ కలా..కానీ టికెట్ కాస్ట్లీ అని అనుకుంటున్నారా...ఏం పర్లేదు ఇక మీదట ఇలా అస్సలు ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే రానున్న రోజుల్లో విమానం ప్రయాణం చౌకగా మారనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బాగా పడిపోవడంతో విమాన ఇంధనం ధరను తగ్గించారు.

New Update
Indigo Air Lines: చౌకగా మారనున్న విమాన ప్రయాణం..తగ్గిన ఇంధనం ధరలు

Indigo Air Lines: రాబోయే రోజుల్లో విమాన ప్రయాణం చౌకగా మారవచ్చును. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బాగా పడిపోవడమే. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 75 డాలర్లు ఉంది. దీని వలన విమానాలకు వాడే ఇంధనాల ధరలు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. అందుకే దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో ఫ్లైట్ టికెట్స్‌లో ఇంధన సర్‌చార్జి (Fuel Surcharge) విధించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అంతకు ముందు ATF ధరల బాగా పెరగడంతో 2023 అక్టోబర్‌ నుంచి ఇంధన సర్‌ఛార్జ్‌లను విధిస్తోంది ఇండిగో ఎయిర్ లైన్స్. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ముడి చమురు (Crude oil) ధరల తగ్గుదలతో నేషనల్ ఆయిల్ కంపెనీ జెట్ ఇంధనం ధరను కూడా బాగా తగ్గించింది. దీంతో ఎయిర్ లైన్స్‌కు బాగా ఆదా అవుతోంది. అందుకే ఇదే ప్రతిఫలాన్ని ప్రయాణికులకు కూడా అందించాలని...వారు కూడా లాభపడేట్టు చేయాలని భావిస్తోంది ఇండిగో.

Also Read:అమెరికాలో కోర్టు రూమ్‌లో జడ్జిని చితక్కొట్టిన నిందితుడు

అందుబాటు ధరలోనే విమాన ప్రయాణం..

ఇంధన ధరల తగ్గడంతో ATF ధరలు కూడా తగ్గుతాయని ఇండిగో చెబుతోంది. ధరలు మారినప్పుడల్లా తాము ఎగ్జిబిట్‌లు, ఇతర భాగాలను సర్దుబాటు చేస్తూనే ఉంటాము. అందుకే తరుచుగా విమాన టికెట్ల రేట్లు మారుతూ ఉంటాయని చెప్పుకొచ్చింది. తాము ఎల్లప్పుడూ వినియోగదారులకు సరసమైన, సమయానుకూలమైన, మర్యాదపూర్వకమైన ఇంకా అవాంతరాలు లేని ప్రయాణాన్ని అందించడానికే చూస్తామని...దానికే కట్టుబడి ఉంటామని చెప్పింది.

అక్టోబర్ 2023లో విమాన ఇంధన ధరలు బాగా పెరిగాయి. దీంతో ఇండిగో తన దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఇంధన ఛార్జీలను రూ. 300 నుండి రూ. 1,000 వరకు పెంచింది. అయితే ఇప్పుడు ఇవే ధరలు దిగివచ్చాయి. ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కార్పొరేషన్ జనవరి నుండి ఇంధన ధరలను 4 శాతం తగ్గించాలని నిర్ణయించింది. దీంతో ఇండిగో పెంచిన విమాన ఇంధన ఛార్జీలను తీసేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు