Kolkata: కోలకత్తా డాక్టర్ రేప్.. అర్థరాత్రి దేశ వ్యాప్తంగా నిరసనలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ డాక్టర్ రేప్ కేసులో న్యాయం జరగాలంటూ నిన్న అర్థరాత్రి చాలా నగరాల్లో నిరసనలు జరిగాయి. అర్థరాత్రి స్త్రీల స్వతంత్రం కోసం అంటూ రాత్రి 11.55 ని.లకు మహిళలు నిరసనలు చేశారు.

New Update
Kolkata: కోలకత్తా డాక్టర్ రేప్.. అర్థరాత్రి దేశ వ్యాప్తంగా నిరసనలు

Reclaim The Night: కోలకతాలో జూనియర్ డాక్టర్ రేప్, హత్యకు వ్యతిరేకంగా అర్ధరాత్రి మహిళలు వీధుల్లోకి వచ్చారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు, ఆసుపత్రులలో డాక్టర్లు నిరసనలు, ప్రదర్శనలు చేస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు దేశ స్వాతంత్ర దినోత్సవం నాడు...ఎప్పుడైతే దేశానికి స్వేచ్ఛ వచ్చిందో కరెక్ట్‌గా అదే సమయానికి మహిళలు రోడ్ల మీద నిరసనలు చేశారు. దేశంలో ప్రధాన నగరాన్నింటిలోనూ ఈ ఉద్యమం జరిగింది. స్వతంత్రం వచ్చిన అర్ధరాత్రి స్త్రీల స్వతంత్రం కోసం అని దీనిని అభివర్ణించారు.

ఈనిరసనల తాలూకా వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మహిళలు తిరిగి రాత్రి వేళల్లో ధైర్యంగా తిరగ గలగాలి అంటూ కొలకత్తా, ఢిల్లీలలో ర్యాలీలు చేశారు. వీటిని రీక్లైమ్ ది నైట్ ర్యాలీలంటారు. అంతకు ముందు 2012లో ఢిల్లీలో బస్సులో సామూహిక అత్యాచారం , హత్య జరిగినప్పుడు ఈ విధంగానే 'రీక్లైమ్ ది నైట్' నిరసనలు నిర్వహించారు.

Also Read:  Kolkata: ఆదివారంలోగా నిందితుడిని ఉరిశిక్ష తీయాలి..దీదీ అల్టిమేటం

Advertisment
Advertisment
తాజా కథనాలు