Ap Elections : కూటమిలో దడ పుట్టిస్తున్న రెబల్స్!

నూజివీడు రెబల్‌ క్యాండిడేట్‌ ముద్రబోయిన వెంకటేశ్వరరావు సోమవారంనామినేషన్ ని విత్‌ డ్రా చేసుకుంటున్నారు.ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆయన భార్య రాధిక కూడా విత్ డ్రా పారాలపై సంతకాలు చేసి తన ప్రతినిధులకు ఇచ్చి నూజివీడు ఆర్డీవో భవాని శంకరి కి అందించారు.

New Update
Ap Elections : కూటమిలో దడ పుట్టిస్తున్న రెబల్స్!

Rebels : ఏపీలో ఎన్నికలు(AP Elections) సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు తమ ప్రచార జోరును పెంచారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షాలు అయినటువంటి టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేన(Janasena) కలిసి కూటమి ఏర్పాటు చేయగా.. మాకు ఎవరి సపోర్ట్‌ అక్కర్లేదు ప్రజలే మాకు క్యాంపైనర్లు అంటూ ముందుకు సాగుతుంది వైసీపీ(YCP).

ఈ క్రమంలోనే ప్రచార జోరును పెంచిన అభ్యర్థులు నామినేషన్ల పర్వాన్ని కూడా ఎంతో ఉత్సాహంగా.. నిర్వహించుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు ముందు నుంచి పార్టీలో టికెట్లు ఆశించి భంగపడడంతో రెబల్స్‌ గా మారి పోటీ చేసేందుకు సిద్దపడ్డారు. ఇక్కడే వచ్చింది అసలు చిక్కంతా... పార్టీ పెద్దల నుంచి టికెట్లు అందుకున్న వారికి రెబల్స్‌ వల్ల టెన్షన్ మొదలైంది.

ఎందుకంటే అప్పటి వరకు వారికి నియోజకవర్గాల్లో మంచి పేరుంది. ఇప్పుడు సడెన్‌ గా వారిని కాదు అని మరొకరికి టికెట్ రావడంతో వారికి ఓట్లు పడతాయో లేదో అనే టెన్షన్‌ వారిలో మొదలైంది.ఈ క్రమంలోనే మూడు రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగా నూజివీడు రెబల్‌ క్యాండిడేట్‌ ముద్రబోయిన వెంకటేశ్వరరావు సోమవారంనామినేషన్ ని విత్‌ డ్రా చేసుకుంటున్నారు.ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆయన భార్య రాధిక కూడా విత్ డ్రా పారాలపై సంతకాలు చేసి తన ప్రతినిధులకు ఇచ్చి నూజివీడు ఆర్డీవో భవాని శంకరి కి అందించారు.

Also Read : రేపే టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో.. హైలెట్స్ ఇవే!

ప్రస్తుతం ముద్రబోయిన కర్నూల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని ఈరోజు సాయంత్రం కలిసి తిరిగి సొంతగూటికి చేరుతున్నట్లుగా సమాచారం. ముద్రబోయిన వెంకటేశ్వరరావు పోటీ నుంచి వైదొలగటంతో నూజివీడు రాజకీయాలు మరింత వేడెక్కాయి. నూజివీడు ప్రజలు స్థానిక ఎమ్మెల్యే మేక వెంకట్ ప్రతాప్ అప్పారావుకి పట్టం కడతారా లేక కొలుసు పార్థసారధికి పట్టం కడతారా అనేది వేచి చూడాలి. వైసీపీ కొలుసు పార్థసారథి స్థానికేతరుడు అంటూ ప్రచారం చేయడమే కాక ముద్రబోయిన వర్గాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు కొలుసు పార్థసారథి కూడా పెనమలూరు కి కూడా నేను స్థానికేతరుడిని కానీ అక్కడ మూడుసార్లు గెలుపొందాను మీకు అభివృద్ధి కావాలా స్థానికత కావాలా అంటూ ఓటర్లను కలుపుకుంటూ ప్రచారంలో దూసుకు వెళుతున్నారు.

సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను విత్‌ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండడంతో ఇంకా ఎంతమంది తమ నామినేషన్లను విత్‌ డ్రా చేసుకుంటారు అనే దానిమీద ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కూటమికి ఆరు చోట్ల నుంచి రెబల్స్ దడ పట్టుకుంది. అందులో విజయనగరం, ఉండి, పోలవరం, గన్నవరం, కావలి , నూజివీడు ఉండగా... ఇందులో నూజివీడు నుంచి ముద్రబోయిన ఆయన నామినేషన్‌ ను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఐదు చోట్ల రెబల్‌ దడ పట్టుకుంది.

ఈ క్రమంలోనే హిందుపురం నుంచి ఇండిపెండెంట్‌ గా బరిలో ఉన్న పరిపూర్ణానంద ..బాలకృష్ణ మీద పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారు.
తన నామినేషన్‌ విత్‌డ్రా వార్తలు నమ్మొదన్న ఉండి రెబల్‌ శివరామరాజు. ముందు నుంచి టీడీపీ టికెట్‌ ఆశించిన ఆయన టికెట్‌ రాకపోవడంతో రెబల్‌ గా బరిలో నిలిచారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు