Govt Employees : ప్రభుత్వ ఉద్యోగులకు అలెర్ట్.. ఇకనుంచి ఆలస్యంగా ఆఫీస్‌కు వచ్చారో అంతే సంగతులు

ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఉదయం 9.15 AM గంటలకు చేరుకోని.. బయోమెట్రిక్ ఇవ్వాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఆదేశించింది. ఎవరైనా ఆలస్యంగా వస్తే వారు హాఫ్‌ డే క్యాజువల్‌ లీవ్‌ను కోల్పోతారని హెచ్చరించింది.

New Update
Govt Employees : ప్రభుత్వ ఉద్యోగులకు అలెర్ట్.. ఇకనుంచి ఆలస్యంగా ఆఫీస్‌కు వచ్చారో అంతే సంగతులు

Alert For Government Employees : ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు ఆలస్యంగా వస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఇలా ఆలస్యంగా వచ్చేవారికి చెక్ పెట్టేందుకు తాజాగా కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) కీలక నిర్ణయం తీసుకుంది. తమ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారులతో సహా అందరూ ఆఫీస్‌కు ఉదయం 9.15 AM గంటలకు చేరుకోని.. బయోమెట్రిక్ ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఉద్యోగులు ఎవరైనా సమయానికి రాక బయోమెట్రిక్ ఇవ్వకపోతే.. సగం రోజు క్యాజువ్ లీవ్‌ను కోల్పోతారని హెచ్చరించింది. అంతేకాదు ఉద్యోగులు బయోమట్రిక్ అటెండెన్స్‌ సిస్ట్‌మ్‌ (Biometric Attendance) నే వినియోగించాలని.. రిజిస్టార్ ఆధారిత అటెండెన్స్‌ను వాడకూడదని డీఏపీటీ ఆదేశించింది.

Also Read: ఇకనుంచి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే.. కోటీ జరిమానా, పదేళ్లు జైలు శిక్ష

ఒకవేళ పలు కారణాల వల్ల ఉద్యోగం సమయానికి ఆఫీస్‌కు రాలేకపోతే.. ఒకరోజు ముందుగానే తెలియజేసి, క్యాజువల్ లీవ్‌ (Casual Leave) కు అప్లై చేసుకోవలని సూచించింది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌ను విడుదల చేసింది. అలాగే ఉద్యోగుల హాజరును, సమయ పాలనను ఆయా సెక్షన్లల సీనియర్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించింది.అయితే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9.00 AM నుంచి సాయంత్రం 5.30 PM వరకు నడుస్తాయి. కానీ సిబ్బంది మాత్రం ఆలస్యంగా ఆఫీసుకు వచ్చి, తొందరగా వెళ్లిపోతూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుంటారనే విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు తమ డ్యూటీ అయినప్పటికీ ఎక్కువ గంటలు పనిచేస్తున్నామని.. సీనియర్ అధికారులు వాదిస్తున్నారు. కోవిడ్‌ (Covid) తర్వాత సమాచారం అంతా సిస్టమ్స్‌లో అందుబాటులో ఉండటం వల్ల.. సెలవుల్లో కూడా పనిచేస్తున్నామని చెబుతున్నారు.

ఇదిలాఉండగా.. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆఫీస్ సమాయలను సక్రమంగా అమలు చేసేందుకు ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్ అటెండెన్స్‌ విధానాన్ని తీసుకొచ్చింది. 2020లో కరోనా వచ్చినప్పుడు బయోమెట్రిక్ వ్యవస్థను ఆపేశారు. మళ్లీ 2022 ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించారు. తాజాగా జారీ చేసిన సర్క్యూలర్‌లో ఆలస్యంగా వచ్చే ఉద్యోగులకు హెచ్చరికలు జారీ కావడంతో.. ఇకనుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో సమయాపాలన సక్రమంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Also Read: ఐటీ రంగంలో ఆగని లేఆఫ్‌లు.. ఈ ఏడాది 98 వేల జాబ్స్‌ కట్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు