KKR vs RCB : బెంగుళూరుకు దెబ్బ మీద దెబ్బ.. 7వికెట్లతో కోలకత్తా విజయం..! రాయల్ ఛాలెంజర్స్ కు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగిలింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచులో కోల్ కతా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై కోల్ కతా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్ కతాకు ఇది రెండో విజయం. By Bhoomi 29 Mar 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Cricket Score Live : ఐపీఎల్ 2024(IPL 2024) 17వ సీజన్ లో భాగంగా కోల్ కతా(Kolkata) వరుసగా రెండోసారి విజయం సొంతం చేసుకుంది. బెంగుళూరు(Bangalore) తో జరిగిన పోరులో ఆర్సీబీ(RCB) జట్టుపై 7 వికెట్ల తేడాతో మ్యాచ్ నెగ్గింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా 16.5ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి విజయాన్ని ఛేదించింది. ఓపెనర్లు కేకేఆర్(KKR) కు శుభారంభం అందించారు. 30 పరుగుల వద్ద ఫిల్ సాల్ట్ ఔటయ్యాడు. కాగా సునీల్ నరైన్ పేలుడు స్టైల్‌లో 47 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సిక్సర్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వెంకటేష్ అయ్యర్ 50 పరుగులు చేశాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ కోహ్లీ 83 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. కోహ్లీ బెంగుళూరుకు భారీ స్కోర్ అందించాడు. గ్రిన్ 33, మాక్స్ వెల్ 28, దినేశ్ కార్తీక్ 20 పరుగులతో విరాట్ కు అండగా నిలిచారు. ఇక రాణా, రస్సెల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. RCB BECOMES THE FIRST TEAM TO LOSE A HOME MATCH IN IPL 2024...!!!! - KKR HAS BROKEN THE STREAK. pic.twitter.com/lk4OwC3Z2n — Johns. (@CricCrazyJohns) March 29, 2024 ఇది కూడా చదవండి : వారిలా నేను గొర్రెను కాను..ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్..! #cricket #ipl-2024 #kkr-vs-rcb మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి