Mutual Fund Risk: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారా? ఈ న్యూస్ మీకోసమే.. 

మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఆర్బీఐ హెచ్చరికలు చేసింది. దేశంలోని 17 మ్యూచువల్ ఫండ్స్‌కు చెందిన 24 పథకాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పింది.రిస్క్‌ను వెంటనే తొలగించాలని ఫండ్ హౌస్‌ లను ఆర్బీఐ కోరింది

New Update
Investments: పదేళ్లలో 10 రూపాయల్ని పదివేలు చేసిన మూడు ఫండ్స్ ఇవే!

Mutual Fund Risk: మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బు పెట్టుబడి పెట్టారా? దీనికి సమాధానం అవును అయితే, ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్స్ కోసం మ్యూచువల్ ఫండ్ ఉత్తమ ఎంపిక అని నిపుణులు చెబుతారు.  SIP ద్వారా ఇందులో ఎక్కువగా పెట్టుబడి పెడతారు. మార్కెట్‌తో అనుసంధానించి ఉన్నా, SIP నేరుగా స్టాక్‌లలో డబ్బు పెట్టుబడి పెట్టడం కంటే తక్కువ రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా పరిగణిస్తారు. ఇందులో ఎంత రాబడి వస్తుందన్న గ్యారెంటీ లేకపోయినా, సిప్‌లో సగటున 12 శాతం రాబడి లభిస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే తాజాగా ఆర్బీఐ 24 పథకాలకు సంబంధించి వార్నింగ్ ఇచ్చింది. RBI ఏం చెప్పిందో తెలుసుకుందాం...

ఆర్బీఐ వార్నింగ్.. 

దేశంలోని 17 మ్యూచువల్ ఫండ్స్‌కు చెందిన 24 పథకాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం, ఇన్వెస్టర్లు ఈ ఓపెన్ డేటెడ్ స్కీమ్‌లలో రూ.1.7 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. నగదు కొరత మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే ఇన్వెస్టర్లు ఈ స్కీమ్‌ల నుంచి డబ్బును విత్‌డ్రా చేయడంలో రిస్క్ ఉండే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, రిస్క్‌ను వెంటనే తొలగించాలని ఫండ్ హౌస్‌ని కోరింది. RBI నివేదిక ప్రకారం, జూలై - సెప్టెంబర్ మధ్య మూడు నెలల అధ్యయనంలో ఈ స్ట్రెస్ కనుగొన్నారు. 

Also Read: మ్యాగీతో పోటీకి టాటా ప్రోడక్ట్ రెడీ..

పెట్టుబడి ప్రమాదకరం

దేశంలో నడుస్తున్న మొత్తం 299 మ్యూచువల్ ఫండ్ పథకాలపై  ఒత్తిడి పరీక్ష జరిగింది. ఇందులో ఇన్వెస్టర్లు రూ.12.4 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. అంటే కేవలం 8% మ్యూచువల్ ఫండ్ పథకాలు మాత్రమే ఒత్తిడిలో ఉన్నాయి. సెబీ నిబంధనల ప్రకారం, అన్ని ఓపెన్ ఎండెడ్ డెట్ పథకాల ఒత్తిడి పరీక్ష ప్రతి నెలా జరుగుతుంది. ఇందులో, అన్ని రకాల రిస్క్‌లు అధ్యయనం చేస్తారు. పథకం పెట్టుబడిదారులు డబ్బును ఉపసంహరించుకునే సమయంలో ఉత్పన్నమయ్యే ప్రమాద పరిస్థితిని కూడా కలిగి ఉంటుంది. ఇటువంటి రిస్క్ ఉన్నట్టుగా తేలితే దాని విషయంలో ఇన్వెస్టర్స్ కు ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేస్తుంది. 

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు