RBI Fine To HSBC : హెచ్ఎస్బీసీ కి ఆర్బీఐ భారీ జరిమానా ఎందుకంటే?

ఆర్బీఐ HSBC కి రూ.29.6 లక్షల భారీ పెనాల్టీ విధించింది.  బ్యాంకుల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, రూపే డినోమినేటెడ్ కో-బ్రాండెడ్ ప్రీపెయిడ్ కార్డ్ కార్యకలాపాలపై రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కొన్ని సూచనలను పాటించనందుకు ఈ పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

New Update
RBI Fine To HSBC : హెచ్ఎస్బీసీ కి ఆర్బీఐ భారీ జరిమానా ఎందుకంటే?

RBI Fine To HSBC Violating Rules : కొన్ని కార్డు సంబంధిత సూచనలను పాటించనందుకు హాంకాంగ్ & షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (HSBC)పై RBI రూ. 29.6 లక్షల జరిమానా విధించింది. బ్యాంకుల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్,  రూపే డినోమినేటెడ్ కో-బ్రాండెడ్ ప్రీపెయిడ్ కార్డ్ కార్యకలాపాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జారీ చేసిన కొన్ని సూచనలను పాటించనందుకు హెచ్‌ఎస్‌బిసికి ఈ పెనాల్టీ విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

RBI ఏం చెప్పింది?
RBI Fine to HSBC : RBI చెబుతున్న దాని ప్రకారం, మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ ఆర్థిక స్థితి నేపథ్యంలో పర్యవేక్షక అంచనా కోసం చట్టబద్ధమైన తనిఖీ (ISE 2022) నిర్వహించారు. ఈ చెక్ లో HSBC ఆర్‌బీఐ ఆదేశాలను పాటించలేదని తేలింది. దానికి సంబంధించి, సంబంధిత కరస్పాండెన్స్ ఆధారంగా బ్యాంకుకు నోటీసు జారీ చేశారు. అందులో, బ్యాంకుకు కారణాలు చెప్పాలని కోరారు. ఆలాగే, పేర్కొన్న సూచనలను పాటించడంలో విఫలమైనందుకు దానిపై ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని అడిగారు. 

నోటీసుకు బ్యాంక్ ప్రతిస్పందన, వ్యక్తిగతంగా హాజరైనప్పుడు ఇచ్చిన మౌఖిక సమాధానం, అది అందించిన అదనపు సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత, బ్యాంక్‌పై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో జరిమానా విధించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ  తెలిపింది. కొన్ని క్రెడిట్ కార్డ్ ఖాతాల్లో చెల్లించాల్సిన కనీస చెల్లింపును లెక్కించేటప్పుడు ప్రతికూల రుణ విమోచన (Negative Amortization)లేదని నిర్ధారించుకోవడంలో బ్యాంక్ విఫలమైందని పేర్కొంది.

దీని కారణంగా జరిమానా విధించారు
అయితే, ఈ పెనాల్టీ (Penalty) చట్టబద్ధమైన, నియంత్రణ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉంటుందని RBI తెలిపింది. దీని ఉద్దేశ్యం బ్యాంకు తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటును ప్రశ్నించడం కాదని ఆర్బీఐ చెబుతోంది. ఇంకా, ద్రవ్య పెనాల్టీ విధించడం వల్ల బ్యాంక్‌పై RBI ప్రారంభించే ఇతర చర్యలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు