RaviTeja Venky: రవితేజ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌.. 'వెంకీ' రీ రిలీజ్.. ఎప్పుడంటే?

రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ వెంకీ. అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం డిసెంబర్ 30 న రీ రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

New Update
RaviTeja Venky: రవితేజ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌.. 'వెంకీ' రీ రిలీజ్.. ఎప్పుడంటే?

ను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా స్నేహ కథానాయికగా కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం వెంకీ. 2004 లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ గా శ్రీను వైట్లకు, సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ కు ఈ సినిమాతో మంచి గుర్తిపు వచ్చింది. లక్ష్మి ప్రొడక్షన్ బ్యానర్ పై అట్లూరి పూర్ణ చంద్ర రావు ఈ సినిమాను నిర్మించారు. అప్పట్లో మేకర్స్ కు ఈ సినిమా భారీ లాభాలను తెచ్చి పెట్టింది.

తాజాగా మేకర్స్ వెంకీ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 30 న శ్రీమాత క్రియేషన్స్ ఈ మూవీని రీ రిలీజ్ చేయనుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. 19 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మర్చిపోలేదు. వెంకీ లోని కామెడీ సీన్స్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పొచ్చు. సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ లో రవితేజ, బ్రహ్మానందం, శ్రీనివాస రెడ్డి, చిత్రం శ్రీను, రామచంద్ర మధ్య జరిగే కామెడీ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. తండ్రి పాత్రలో నటించిన తనికెళ్ళ భరణి, రవితేజ మధ్య ఉండే డైలాగ్స్ నవ్వులు పూయించాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రైన్ ఎపిసోడ్ కామెడీ సీన్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇక మీమ్స్ లో విపరీతంగా వాడుతూనే ఉన్నారు. సినిమాలో రవితేజ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. రవితేజ సూపర్ హిట్ చిత్రాల్లో వెంకీ ఒకటి. అప్పట్లోనే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా రీ రిలీజ్ అంతే రవితేజ ఫ్యాన్స్ కు పండగే.

Also Read: ‘మరుగుదొడ్లను శుభ్రం చేస్తారు..’ డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై తేజస్వీ ఆగ్రహం!

Advertisment
Advertisment
తాజా కథనాలు