రవితేజ ఫ్యాన్స్​కు సడెన్ సర్ ప్రైజ్.. ఓటీటీలో 'టైగర్ నాగేశ్వరరావు'

స్టార్ హీరో రవితేజ నటించిన తాజా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం మిడ్ నైట్ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సెన్సార్‌లో కట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఇందులో చూపించినట్లు తెలుస్తోంది.

New Update
రవితేజ ఫ్యాన్స్​కు సడెన్ సర్ ప్రైజ్.. ఓటీటీలో 'టైగర్ నాగేశ్వరరావు'

టాలీవుడ్ మాస్ హీరో రవితేజ అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు 'టైగర్ నాగేశ్వరరావు' మేకర్స్. ఏలాంటి ప్రచారం, సమాచారం లేకుండానే ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసి ఫ్యాన్స్, నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా గురువారం అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే సెన్సార్‌లో కట్ అయిన కొన్ని సన్నివేశాలను ఇందులో చూపించినట్లు తెలుస్తోంది.

ఇక 1970లో గజగజలాడించిన స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీపై మొదటినుంచే అంచనాలు పెరిగిపోయాయి. దీంతో డిజిటల్ రైట్స్‌కు భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. చివరికీ ఈ మూవీ ఓటీటీ హక్కులను ఫేమస్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే దీనికోసం అమెజాన్ సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు తెలుస్తుండగా.. రవితేజ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ డీల్ అని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక 2023 అక్టోబర్ 20న థియేటర్ లో విడుదలైన  ఈ సినిమా మొదటి రోజే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో రాకపోగా బాక్సాఫీస్ వద్ద నష్టాలతోనే రన్‌ను ముగించాల్సి వచ్చింది.

Also read :పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోవడానికి మొబైల్ కారణమా?

ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్

నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?

New Update
Advertisment
Advertisment
Advertisment