/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-15-5.jpg)
Ravi Teja RT 75 Movie Launching Event : మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తన 75 వ సినిమాని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ భాను భోగవరపు తెరకెక్కించనున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నేడు ఘనంగా పూజా కార్యక్రమాలతో షురూ అయింది.
హైదరాబాద్ (Hyderabad) లో జరిగిన ఈ ఈవెంట్‌లో రవితేజ, శ్రీలీల (Sreeleela), నిర్మాత సూర్యదేవర నాగవంశీ, డైరెక్టర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మూవీ లాంఛింగ్ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాలో శ్రీలీల మరోసారి రవితేజతో జోడి కడుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి నటించిన 'ధమాకా' బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది.
సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. దానికి తోడూ ఇద్దరూ మాస్ డ్యాన్స్ తో అదరగొట్టేశారు. ఇక ఇప్పుడు మరోసారి ఈ జోడి కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. కచ్చితంగా ఈ సినిమాతో ధమాకా (Dhamaka) మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
Gear up for an ultimate mass entertainer! 🔥🤙🏻
𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐉𝐀 @RaviTeja_offl ~ #RT75 Launched officially with a pooja ceremony today! 💫✨
Shoot begins from Today! 🔥
A Sankranthi 2025 Release. 🥳@sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/V6scL2SK01
— Sithara Entertainments (@SitharaEnts) June 11, 2024