/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-35-4.jpg)
Ravi Chandran Trapped In The Lift : కేరళ (Kerala) లోని ఓ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. రవిచంద్రన్ నాయర్ (59) అనే రోగి 42 గంటల పాటు లిఫ్ట్‌లో ఇరుక్కున్న షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలారం బటన్ నొక్కుతూ, అందులోని హెల్పలైన్ నెంబర్లకు కాల్ చేసిన ఎవరూ స్పందించలేదని రవిచంద్రన్ వాపోయాడు. తనకు తోచిన ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ ఏదీ ఫలించలేదని, దీంతో రెండు రోజులు మలమూత్రాలు అందులోనే విసర్జించినట్లు చెప్పారు. ఆ స్మెల్ తట్టుకోలేక కళ్లు తిరిగి పడిపోయినంత పనైందని, దాహం వేసినప్పుడు పెదవులు చప్పరించుకుంటూ ఉన్నానని తన బాధను వర్ణించాడు.
42 గంటలు నరకం..
ఈ మేరకు రవిచంద్రన్ (Ravi Chandran) మాట్లాడుతూ.. మొదట లిఫ్ట్ ఆగగానే అలారం బటన్‌ను నొక్కాను. కానీ స్పందన లేదు. లిఫ్ట్ ఆపరేటర్‌ను సంప్రదించగలిగే ఇంటర్‌కామ్ సహాయం లేదు. ఫోన్‌ని ఉపయోగించి లిఫ్ట్ లోపల వ్రాసిన వివిధ హెల్ప్‌లైన్ నంబర్‌లకు కాల్ చేసాను. నో రెస్పాన్స్. ఆ టెన్సన్ లో నా ఫోన్ చేతిలోంచి జారిపోయి కిందపడి పగిలింది. ఫోన్ పగిలిన తర్వాత నేను ఒక మూలలో కూర్చుని ఎవరైనా వస్తారని ఎదురుచూడటం మొదలుపెట్టాను. 42 గంటల్లో నేను చాలాసార్లు గట్టిగా ఏడ్చాను. నిద్ర కూడా పట్టలేదు. నా ఆత్మ స్థైర్యం దెబ్బతింటున్నప్పుడు నా భార్య రాసిన కవితలను గుర్తు చేసుకున్నానని తెలిపాడు.
లిఫ్ట్ ఆపరేటర్ బతికించాడు..
నా కుటుంబ సభ్యులు నాకోసం చూపి మా ఆఫీసుకు ఫోన్ చేశారు. అక్కడ కూడా లేడని తెలిసి పోలీస్ స్టేషన్‌లో మిస్సిగ్ కేసు నమోదు చేశారు. అయితే సోమవారం ఉదయం లిఫ్ట్ ఆపరేటర్ డ్యూటీకి వచ్చి నన్ను రక్షించారు. లిఫ్టును కిందకు దించి తలుపులు తెరిచి బయటకు తీశాడు. ఆ తర్వాత మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ.. లిఫ్ట్ ఆపరేటర్ (Lift Operator) సహా ముగ్గురిని సస్పెండ్ చేసింది.
Also Read : గుడివాడలో కొడాలి నానికి బిగ్ షాక్.. ఆఫీసు స్వాధీనం!