Ashwin : స్పిన్‌ చాణక్యుడి ఖాతాలో అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా ఘనత!

టీమ్ ఇండియా స్పిన్ మాయజాలం రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. రాంచీ వేదికగా ఇంగ్లాండుతో జరుగుతున్న నాలుగో టెస్టులో జానీ బెయిర్ స్టోను అవుట్ చేసి ఒకే జట్టుపై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా అవతరించాడు.

New Update
Ashwin : స్పిన్‌ చాణక్యుడి ఖాతాలో అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా ఘనత!

IND vs ENG : భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) మరో అరుదైన ఘనత సాధించాడు. ఓకే జట్టుపై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మేరకు ఇంగ్లాండ్(England) తో రాంచీ వేదికగా జరుగుతున్న 4వ టెస్టులో జానీ బెయిర్ స్టోను ఎల్బీ డబ్ల్యూ చేసిన అశ్విన్ ఈ అరుదైన ఘనత సాధించాడు.

తొలి బౌలర్..
ఈ మేరకు రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌లో బెయిర్‌ స్టో వికెట్ తీసి ఈ ఘనత దక్కించుకున్నాడు. దీంతో 23 టెస్టు మ్యాచ్‌ల్లో ఒకే టీమ్ పై 100 వికెట్ల మార్క్‌ చేరుకున్నాడు. అంతేకాదు భారత్‌(India), ఇంగ్లాండ్‌ మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌ కూడా అశ్వినే కావడం విశేషం. కాగా అశ్విన్ కంటే ముందు జేమ్స్‌ అండర్సన్‌ టీమ్‌ఇండియాపై 35 టెస్టుల్లో 139 వికెట్లు తీశాడు. అంతేకాదు.. టెస్టుల్లో ఒక దేశంపై 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గానూ రికార్డ్‌ సాధించాడు. అలాగే స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా అశ్విన్‌ కొనసాగుతున్నాడు. అనిల్ కుంబ్లే 63 మ్యాచ్‌ల్లో 350 వికెట్లతో ముందున్నాడు. ప్రస్తుతం 58 టెస్టుల్లో 349 వికెట్లు తీసిన అశ్విన్‌ మరో 2 వికెట్లు పడగొడితే కుంబ్లే రికార్డ్ బ్రేక్ చేస్తాడు.

ఇది కూడా చదవండి : Siddique: పది కేజీలు తగ్గితేనే కలుస్తానన్నాడు.. రాహుల్ గాంధీపై జీషాన్ విమర్శలు!

7వ బౌలర్‌గా మరో ఘనత..
ఇదిలావుంటే మొత్తం క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 7వ బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. జార్జ్‌ గిఫెన్‌, మోనీ నోబెల్‌, విల్‌ఫ్రెడ్‌ రోడ్స్‌, గార్‌ఫీల్డ్‌ సోబెర్స్‌, ఇయాన్‌ బోథమ్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ ఈ ఫీట్‌ సాధించిన వారిలో ముందంజలో ఉన్నారు. ఇక ఈ టెస్టులో వెంట వెంటనే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను జో రూట్‌ అర్ధ శతకంతో ఆదుకున్నాడు. క్రీజులో పాతుకుపోయి రూట్ 108 బంతుల్లో 50 పరుగులు చేశాడు. టెస్టుల్లో భారత్‌పై ఎక్కువ సార్లు అర్ధ శతకాలు (20) సాధించి రికీ పాంటింగ్‌ సరసన నిలిచాడు. ఆసియా పిచ్‌లపై గత 19 ఇన్నింగ్స్‌లో రూట్‌కు ఇది రెండో హాఫ్‌ సెంచరీ కాగా.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 49 ఓవర్లకు 176/5 స్కోర్ తో ఆట కొనసాగిస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment