Ravi Teja Movies: రవితేజకు ఓటీటీ దెబ్బ గట్టిగానే తగిలిందట.. ఆ సినిమాలు ఆగిపోయాయా? ఓటీటీతో నట్టింటిలో సినిమాల సందడి మొదలైంది. దీంతో సినిమాల కోసమే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు తగ్గిపోయారు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు హీరోలపై పడుతోందని అనుకుంటున్నారు. రవితేజతో ఎనౌన్స్ అయిన రెండు సినిమాలు నిర్మాతలు డ్రాప్ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. By KVD Varma 08 Dec 2023 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Ravi Teja Movies: కొన్నేళ్ల క్రితం ప్రజలకి వినోదం అంటే సినిమా ఒక్కటే.. టీవీలు వచ్చిన తరువాత కొంత మార్పు వచ్చింది. కానీ.. ఇప్పుడు ఓటీటీ వ్యవస్థ వచ్చిన తరువాత పరిస్థితి మారింది. మరింత వినోదం ఇంటి హాలులోకి వచ్చి కూచుంది. వినోదం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. అభిమాన హీరోని చూడాలంటే, ఒక బటన్ నొక్కితే చాలు నట్టింట ప్రత్యక్షం అయిపోతున్నాడు. దీంతో సహజంగానే థియేటర్లకు సినిమా కోసం వెళ్లే జనం తగ్గిపోతున్నారనేది వాస్తవం. ఒక సినిమా విడుదల అయితే, ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే, బావుంది అంటేనే థియేటర్ కి వెళుతున్న పరిస్థితి ఉంది. సినిమా టాక్ బావుంటేనే పెద్ద తెర.. లేకపోతె ఎలానూ ఇంట్లోని బుల్లితెర మీదకు వస్తుందిగా చూడొచ్చు అని లైట్ తీసుకుంటున్నారు. ఓటీటీ ప్రభావం చాలా గట్టిగానే సినిమాలపై పడుతోంది. కంటెంట్ ఉంటె తప్ప సినిమా నిలబడలేని పరిస్థితి. దానికి తోడు నిర్మాతలు కూడా సినిమా విడుదలతో పాటే ఓటీటీ రైట్స్ కూడా అమ్మేసుకుంటున్నారు. దీంతో సినిమా హిట్ అయితే 50 రోజుల తర్వాత.. కాకపోతే రెండు వారాల్లోనే ఓటీటీలో ప్రత్యక్షం అయిపోతోంది. ఇదీ ఇప్పుడు పరిస్థితి. ఇదంతా ఎందుకంటే, టాలీవుడ్ సర్కిల్స్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. చాలామంది హీరోల సినిమాలు ఆగిపోయాయని. ఎందుకంటే, నిర్మాతలు ఓటీటీ దెబ్బకు సినిమా ఖర్చులు తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నారట. అందుకే అందరూ ఆ పనిలో పడ్డారని టాక్. ఈ నేపథ్యంలో నిర్మాతల కాస్ట్ కటింగ్ దెబ్బ మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja Movies) మీద గట్టిగానే పడిందని చెప్పుకుంటున్నారు. రవితేజ చేయాల్సిన కొత్త సినిమాలు ఆగిపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఒక సినిమా రవితేజ హీరోగా చేయనున్నట్టు ప్రకటించింది. అయితే, ఆ సినిమా ఇప్పుడు ఆగిపోయింది అని అంటున్నారు. రవితేజ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగారనీ.. అంత ఇవ్వడం వలన బడ్జెట్ భారీగా పెరిగిపోతుందని నిర్మాతలు భావించారట. బడ్జెట్ పెరుగుతో పోతే రెవెన్యూ అంత వచ్చే అవకాశం లేదని వారి లెక్కలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే సినిమా ఆపేశారని చెప్పుకుంటున్నారు. ఇక హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ(Ravi Teja Movies) హీరోగా ఒక సినిమా ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమా కూడా అటకెక్కింది అని టాలీవుడ్ టాక్. Also Read: హీరో నానికి బిగ్ షాక్.. హాయ్ నాన్న మూవీ HDక్వాలిటీ వీడియో ఆన్‌లైన్ లో లీక్ రవితేజ(Ravi Teja Movies) రెమ్యునరేషన్ బాగా పెంచేశారని.. అంత రెమ్యునరేషన్ ఇవ్వడం వలన లాభం ఉండదని నిర్మాతలు భావిస్తున్నారట. నిజానికి రవితేజతో రెగ్యులర్ గా సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ కొందరు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు వారు కూడా కొంచెం వెనక్కి తగ్గారట. ఇలా రవితేజ పేరు బయటకు వచ్చింది కానీ, ఇంకా చాలామంది హీరోల పరిస్థితి కూడా అలానే ఉందట. చాలా సినిమాలు ఎనౌన్స్ అయినా.. నిర్మాణం ఆగిపోయాయని సమాచారం. ఇప్పుడు ఓటీటీ ప్రభావంలో ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి నిర్మాతలు సిద్ధం అవడం లేదని చెబుతున్నారు. అయితే, రవితేజ లాంటి హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటే, ఈ నిర్మాతలు సినిమాలు తీయడం కోసం రెడీ కావచ్చని అనుకుంటున్నారు. Watch this interesting Video: #tollywood #ravi-teja #ott మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి