నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది: రష్మిక! ఈ బ్యూటీ పెళ్లి గురించి ఎదురైన ప్రశ్న గురించి స్పందిస్తూ నాకు నరుటోతో ఇప్పటికే పెళ్లి అయిందని నా మనస్సులో ఉన్న వ్యక్తి అతనేనని అన్నారు.ఎనిమీ సిరీస్ లోని ఒక పాత్రతో తనకు పెళ్లి జరిగిందని రష్మిక సరదాగా వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం. By Bhavana 04 Aug 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో రష్మిక (Rashmika) ఒకరు. ఆమె గురించి అప్పుడప్పుడూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. వాటిలో ఎక్కువగా విజయ్ దేవరకొండతో ఉన్న విషయమే ఉంటుంది. ఈ రీల్ జోడీ రియల్ జోడీ అయితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే తాజాగా రష్మిక పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. అవి ప్రస్తుతం నెట్టింట హాల్‌చల్ చేస్తున్నాయి. కిరిక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన రష్మిక భాషతో సంబంధం లేకుండా పాపులారిటీని పెంచుకున్నారు. మహేష్ బాబు , అల్లు అర్జున్ లకు జోడీగా నటించిన రష్మిక భవిష్యత్తులో మరి కొందరు స్టార్ హీరోలకు జోడీగా నటించనున్నారని తెలుస్తోంది. ప్రభాస్, ఎన్టీఆర్, పవన్, చరణ్ లకు రష్మిక జోడీగా నటిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి గురించి ఎదురైన ప్రశ్న గురించి స్పందిస్తూ నాకు నరుటోతో ఇప్పటికే పెళ్లి అయిందని నా మనస్సులో ఉన్న వ్యక్తి అతనేనని అన్నారు. ఎనిమీ సిరీస్ లోని ఒక పాత్రతో తనకు పెళ్లి జరిగిందని రష్మిక సరదాగా వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం. పుష్ప2, యానిమల్, రెయిన్ బో సినిమాలతో రష్మిక బిజీగా ఉండగా రాబోయే రోజుల్లో రష్మికకు మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కెరీర్ పరంగా రష్మిక మరింత ఎదిగి బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కెరీర్ విషయంలో రష్మిక ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఆమె టాలెంట్ కు తగిన మరిన్ని ఆఫర్లు రావాలని అభిమానులు భావిస్తున్నారు. #viral #tollywood #comments #rashmika #marriege #vijaya-devarakonda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి