Pushpa 2: శ్రీవల్లి ఏంటీ ఇలా ఉంది .. పుష్ప 2 నుంచి లీకైన రష్మిక లుక్..!

స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప 2. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుండగా.. సినిమాలో శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఓ ఫొటో లీకైంది. ఎరుపు రంగు చీరలో ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి కనిపించింది.

New Update
Pushpa 2:  శ్రీవల్లి ఏంటీ ఇలా ఉంది .. పుష్ప 2 నుంచి లీకైన రష్మిక లుక్..!

Rashmika Mandanna Pic Leaked from Pushpa 2 Movie: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Director Sukumar) కాంబోలు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం పుష్ప 2. హై స్టాండర్డ్ సినిమాటిక్ వ్యాలూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించగా.. పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే  విడుదలైన పుష్ప రాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై  విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. ఇక ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

Also Read: Rana Daggubati - సరి కొత్త టాక్ షోతో రానా దగ్గుబాటి.. షో పేరేంటో తెలుసా..!

పుష్ప 2 నుంచి లీకైన శ్రీవల్లి లుక్

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి లీకైన రష్మిక (Rashmika Mandanna) లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ వైజాగ్ లో జరుగుతుండగా.. శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఓ ఫోటో బయటకు వచ్చింది. ఎరుపు రంగు చీరలో ఒంటినిండా ఆభరణాలు ధరించి రాయల్ లుక్ లో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుకుతుంది.

పుష్ప 2 చిత్రంలో ఫహద్ ఫాసిల్, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మిరెస్లోవ్ కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్న పార్ట్ 2.. పార్ట్ 1 ను మించి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: RRR మూవీ లో అసలు ట్విస్ట్ అదే.. కానీ స్టోరీ మొత్తం మార్చేశాము..! SS రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు