Rashmika : "'నేను సినిమాలు నమ్మకంతోనే చేస్తాను..ఎందుకంటే..:''! రష్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ యూజర్ కి తనదైన శైలిలో సమాధానం చెప్పి నోరు మూయించింది. స్క్రిప్ట్ మీద నమ్మకంతోనే సినిమాలు చేస్తాం తప్పా... సినిమాలు ఫ్లాప్ అవుతాయని చేయము అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. By Bhavana 14 Feb 2024 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి Rashmika: తన రీసెంట్ బ్లాక్ బస్టర్ యానిమల్ సినిమా విజయాన్ని ఇంకా ఆస్వాదిస్తూనే ఉంది నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) . రష్మిక ఎప్పుడూ సోషల్ మీడియాలో (Social Media) చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన చిన్న, పెద్ద అప్‌డేట్‌లను ఎప్పుడూ అభిమానులతో పంచుకుంటుంది. కాగా, 'పుష్ప 2' (Pushpa 2) నటి రష్మిక మందన్న మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ యూజర్ రష్మిక గురించి నోరు జారాడు. అంతటితో ఆగకుండా ఏదో వాగాడు. మరి రష్మిక ఊరుకుంటుందా..! అతను నోరు మూసేలా సమాధానం ఇచ్చింది. రష్మిక రెండేళ్ల క్రితం శర్వానంద్ తో చేసిన ఆడవాళ్లు మీకు జోహర్లు సినిమా గురించి ట్రోలర్ నోరు జారాడు. దాని గురించి రష్మికను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు లేవనెత్తాడు. దీంతో రష్మిక అతనికి బుద్ది వచ్చేలా పాఠం చెప్పింది. యూజర్ ఏమన్నాడంటే.. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నాకు నచ్చకపోయినప్పటికీ నేను కేవలం కిషోర్ తిరుమల, శర్వానంద్, రష్మిక కారణంగానే నేను సినిమాకి వెళ్లాను.... అంటూ రాసుకొచ్చాడు. దాంతో రష్మిక రిప్లై ఇస్తూ.. 'ఎవరు చెప్పారు?' స్క్రిప్ట్ మీద నమ్మకంతో సినిమాలు చేస్తాను. నటీనటులు, సిబ్బందితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. వారితో కలిసి పనిచేయడం నాకు చాలా ఇష్టం. అసలు ఈ పుకార్లు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావడం లేదు. రష్మిక వర్క్ ఫ్రంట్ గురించి మాట్లాడుతూ, ఆమె త్వరలో 'పుష్ప: ది రూల్', 'రెయిన్‌బో', 'ది గర్ల్‌ఫ్రెండ్' మరియు 'చావా' చిత్రాలలో కనిపించనుంది. ఇటీవల రష్మిక మందన్న రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' చిత్రంలో గీతాంజలి పాత్రను పోషించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. Also read: శరీరం కొద్ది సేపటికే అలసిపోతుందా.. అయితే దానికి కారణం ఇదే కావొచ్చు! #social-media #pushpa-2 #rasmika మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి