Nalgonda: ఇంటి స్థలం పట్టాల పంపిణీ కార్యక్రమంలో రసాభాస

నల్గొండ జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం రసాభాసకు దారి తీసింది. నల్గొండ జిల్లా మాడ్గూలపల్లి మండల పరిధిలోని ఆగమోత్కూరులో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పర్యటించారు. ఆ గ్రామంలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలేదని, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

New Update
Nalgonda: ఇంటి స్థలం పట్టాల పంపిణీ కార్యక్రమంలో రసాభాస

నల్గొండ జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం రసాభాసకు దారి తీసింది. నల్గొండ జిల్లా మాడ్గూలపల్లి మండల పరిధిలోని ఆగమోత్కూరులో సోమవారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పర్యటించారు. ఆ గ్రామంలో ఇళ్ల పట్టాల కోసం 180 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు సర్వేలు సైతం చేశారు. చివరకు ఇళ్ల పట్టాలకు 74 మంది అర్హులుగా ప్రకటించారు. నేడు అధికారులు వారి పేర్లు చదువుతుండటంతో పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా.. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చారని ఆందోళనకు దిగారు.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. సొంత ఇళ్లు కలిగి ఉండి, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. లబ్దిదారులకు ఇళ్లు ఇవ్వకుండా.. ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. దీంతో గ్రామస్తులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఆందోళనకు దిగిన గ్రామస్తులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా గ్రామంలో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరో గ్రామస్తులే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

అయినా ఆందోళనను విరమించని గ్రామస్తులు.. అధికారుల సలహాకు సైతం స్పందించలేదు. దీంతో ఇళ్ల స్థలాలకు అర్హులు ఎవరనే దానిపై మరో మూడు రోజుల్లో తనకు నివేదిక అందజేయాలని మాడ్గులపల్లి తహసీల్దార్ గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యే ఇళ్ల పట్టాలు ఇవ్వకుండానే వెనుదిరిగారు. కాగా ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అధికార పార్టీ నేతలకు ప్రభుత్వ అధికారలు తల వంచుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చేందిన నేతలు ఇచ్చే ముడుపులు తీసుకుంటూ.. వారు చెప్పింది చేస్తున్నారన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు