Film News: పొలిటికల్ యాక్షన్ మూవీగా గేమ్ ఛేంజర్..రిలీజ్ ఎప్పుడంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా విడుదలపై కీలక అప్ డేట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. పొలిటికల్ యాక్షన్ మూవీ అని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

New Update
Film News: పొలిటికల్ యాక్షన్ మూవీగా గేమ్ ఛేంజర్..రిలీజ్ ఎప్పుడంటే?

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. తమళ స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఐదు ఇండియన్ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, గేమ్ ఛేంజర్ పొలిటికల్ యాక్షన్ మూవీ అని వెల్లడించారు.

Also Read: చిన్నకొడుకుతో కలిసి పెద్ద కొడుకుని చంపిన తల్లి.. గొంతుకు చీరను చుట్టి కడుపులో..

దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే, ఈ మూవీ పక్కా విడుదల తేదీ మాత్రమే అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ‘జరగండి’ సాంగ్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది.

publive-image

Also Read: సీఎం జగన్ పై దాడి జరిగిందో లేక జరిపించుకున్నారో: కేఏ పాల్

ఆచార్య సినిమా తరువాత రామ్ చరణ్ వెండితెరపై కనిపించనుండడంతో అభిమానులు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చరణ్ గత 3 సంవత్సరాలుగా గేమ్ ఛేంజర్‌‌ సినిమాతో బిజీగా ఉన్నారు. దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు స్టార్ సింగర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు