Ramcahran and Janhvi: జగదేక వీరుడు.. అతిలోకసుందరి రామ్ చరణ్ - జాన్వీ అయితే ఎలా ఉంటుందంటే.. 

జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చరిత్ర రిపీట్ అయితే బావుండును అనిపిస్తుంది. దానిని రామ్ చరణ్-జాన్వీ కపూర్ చేస్తే బావుంటుంది అని చిరంజీవితో పాటు అభిమానులందరూ కోరుకుంటారు. ఆ ఇద్దరూ ఈ సినిమాలో ఉంటె ఎలా ఉంటుందో చెప్పే ట్రెండింగ్ లో ఉన్న వీడియో ఈ ఆర్టికల్ లో చూసేయండి. 

New Update
Ramcahran and Janhvi: జగదేక వీరుడు.. అతిలోకసుందరి రామ్ చరణ్ - జాన్వీ అయితే ఎలా ఉంటుందంటే.. 

Ramcahran and Janhvi: మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో టాప్ టెన్ లో ఉండే జగదేకవీరుడు.. అతిలోకసుందరి సినిమా ఉండి తీరుతుంది. చిరంజీవి-శ్రీదేవి జంట నిజంగా టైటిల్ కు తగ్గట్టుగానే మూవీలో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు చిరంజీవి తనయుడు ఈ సినిమా మెగా హీరో  రామ్ చరణ్ ఇండియన్ సినిమా స్క్రీన్ పై ఒక రేంజ్ లో మెరిసిపోతున్నాడు. రంగస్థలం సినిమాతో స్టార్ యాక్టర్ గా గట్టి దమ్ము చూపించిన రామ్ చరణ్ తరువాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఇంకా చెప్పాలంటే గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఇటు దురదృష్టవశాత్తూ అందాల శ్రీదేవి మన మధ్యలో లేకపోయినా.. ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ లో మంచి స్టార్ గా ఎదిగింది. టాలీవుడ్ లో ఆమె అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమాతో తెలుగులో జాన్వీకపూర్ (Ramcahran and Janhvi)ఎంట్రీ ఇస్తోంది. 

ఇప్పుడు రామ్ చరణ్.. జాన్వీకపూర్(Ramcahran and Janhvi) ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. దీనిలో కియారా అద్వానీ హీరోయిన్. దాని తరువాత రామ్ చరణ్ RC16 (ఇంకా టైటిల్ రాలేదు)పట్టాలెక్కబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా మొన్న ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. దీంతో రామ్ చరణ్-జాన్వీ కపూర్(Ramcahran and Janhvi) కాంబినేషన్ మళ్ళీ చిరంజీవి-శ్రీదేవి కాంబినేషన్ ని గుర్తుకు తెస్తోందని అభిమానులు సంబరపడిపోతున్నారు. అంతేకాదు.. ఈ కాంబినేషన్ చిరంజీవి కోరిక అనే విషయం ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. 

Also Read: భైరవగా ప్రభాస్.. ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న కల్కి పోస్టర్

అవును.. ఏడేళ్ల క్రితం ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా నీహారిక రామ్ చరణ్-చిరంజీవిలు ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె రామ్ చరణ్ ను ‘చిరంజీవి సినిమాల్లో రీమేక్ చేయాలంటే ఏ సినిమా చేస్తావ్?’ అని అడిగింది. దానికి రామ్ చరణ్ ‘గ్యాంగ్ లీడర్’ అని బదులిచ్చాడు. వెంటనే పక్కనే ఉన్న చిరంజీవిని రామ్ చరణ్ ఏ సినిమా రీమేక్ చేస్తే బావుంటుంది అని నీహారిక ప్రశ్నించింది. దానికి చిరంజీవి వెంటనే.. జగదేకవీరుడు..అతిలోకసుందరి అని రిప్లై ఇచ్చారు. అయితే, హీరోయిన్ ఎవరు? అని నీహారిక అడుగుతూ ఉండగానే.. చిరంజీవి ఠక్కున శ్రీదేవి కూతురు జాన్వీ (Ramcahran and Janhvi)అయితే బావుంటుంది అని ఉద్వేగంగా చెప్పారు. ఇది అప్పట్లో వైరల్ అయింది. కట్ చేస్తే.. ఇప్పుడు రామ్ చరణ్.. జాన్వీ జంటగా సినిమా అనగానే అభిమానులు ఈ ఇంటర్వ్యూను గుర్తు చేసుకుంటున్నారు. 

నిజానికి రామ్ చరణ్ RC16 జగదేకవీరుడు.. అతిలోకసుందరి రీమేక్ కాదు. కానీ, అభిమానులు మాత్రం చిరంజీవి ఏడేళ్ల క్రితం కోరిక ఇప్పుడు తీరుతోంది అంటూ సంబరపడిపోతున్నారు. ఇప్పుడు ఒక అభిమాని ఏకంగా జగదేకవీరుడు.. అతిలోకసుందరి సినిమాలో రామ్ చరణ్.. జాన్వీ (Ramcahran and Janhvi)ఉంటె ఎలా ఉంటుంది అంటూ ఏఐ సహాయంతో చేసిన ఒక వీడియోను X లో షేర్ చేశాడు. జాన్వీ పుట్టినరోజు సందర్భంగా.. శుభాకాంక్షలు చెబుతూ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియోలో అప్పట్లో నీహారిక ఇంటర్వ్యూలో రామ్ చరణ్, చిరంజీవి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. దీంతో అభిమానులు ఈ వీడియో చూసి ఖుషి అయిపోతున్నారు. రామ్ చరణ్-జాన్వీ జంటగా(Ramcahran and Janhvi) జగదేకవీరుడు..అతిలోకసుందరి రీమేక్ అయితే అదిరిపోతోంది కదా అనుకుంటున్నారు. 

రామ్ చరణ్ - జాన్వీల పై అభిమాని చేసిన వీడియో ఇక్కడ ఈ ట్వీట్ లో చూసేయండి:

Advertisment