Ram Mandir: టైమ్స్‌ స్క్వేర్‌లో రామాలయ ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం..

యూపీలోని అయోధ్యలో ఈ ఏడాది జనవరి 22న రామాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న టైమ్స్ స్క్వేర్‌లో ప్రత్యక్షప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని సమాచారం.

New Update
Ram Mandir: టైమ్స్‌ స్క్వేర్‌లో రామాలయ ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం..

ఈ ఏడాది జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రామాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం వేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ వేడుకను తిలకించేందుకు కోట్లాది మంది భారతీయులు సిద్ధమైపోయారు. అందరూ ఈ కార్యక్రమాన్ని అయోధ్యకు వెళ్లి చూడటం సాధ్యం కాదు. అందుకోసమే దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలను ఏర్పాటు చేస్తున్నారు.

టైమ్‌ స్క్వేర్‌లో ప్రత్యక్ష ప్రసారం

అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు భారతీయ ఎంబసీలు, కాన్సులేట్లలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. అయితే మనందరికి అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న టైమ్స్ స్క్వేర్‌ గురించి తెలిసిందే. ఆ బిల్డింగ్‌పై కనిపించే దృశ్యాలు ప్రపంచ దేశాల ప్రజలను ఆకట్టుకుంటాయి. అందుకోసమే అయోధ్యలో జరగనున్న రామాలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని టైమ్‌ స్క్వేర్‌లో ప్రత్యక్షప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.

Also read: సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం.. ప్రజాపాలన వెబ్‌సైట్‌ ప్రారంభం..

ప్రధాని ప్రసంగం

ఇప్పటికే ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని సమాచారం. ఈ విషయాన్ని పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మరో విషయం ఏంటంటే రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయ్యాక ప్రధాని మోదీ భక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా లైవ్‌ ప్రసారం చేయనున్నట్లు సమాచారం. మరో విషయం ఏంటంటే టైమ్‌ స్క్వేర్‌లో రామ మందిరాన్ని ప్రదర్శించడం ఇది మొదటిసారి కాదు.

Also Read: లక్షద్వీప్‌తో మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటీ.. స్థానిక ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

2020 ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ భూమిపూజ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజున రామమందిర చిత్రాన్ని టైమ్స్‌ స్క్వేర్‌లో ప్రదర్శించారు. ఇక జనవరి 22న రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన జరగనుంది. ఈ వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రధాని మోదీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు, లక్షలాది మంది ప్రజలు, వేలాది మంది సాధువులు హాజరుకానున్నారు. ఇదిలాఉండగా.. రామాలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందంటూ విపక్ష పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు