Ram Charan : 'గేమ్ ఛేంజర్' ఆలస్యంతో రామ్ చరణ్ షాకింగ్ డెసిషన్..! రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాకు సంబంధించి ఓ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడట. తొలుత ఈ మూవీ నుంచి వచ్చే లాభాల్లో షేర్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాడట. కానీ ఆలస్యమయ్యే కొద్ది నిర్మాత వడ్డీల భారం పెరుగుతుందని తెలిసి తన నిర్ణయాన్ని చరణ్ మార్చుకున్నాడట. By Anil Kumar 14 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Ram Charan Shociking Decision For Game Changer Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ చేంజర్'. ఈ సినిమా షూటింగ్ మొదలై మూడేళ్లయినా ఇంకా సెట్స్ పైనే ఉంది. ఇందుకు కారణం 'ఇండియన్ 2' మూవీ. డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ చేస్తున్న టైం లోనే ఇండియన్ 2 ను సైతం సెట్స్ పైకి తీసుకెళ్లాడు. దీంతో ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్స్ చేయడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో కొంతకాలం గేమ్ ఛేంజర్ ను పక్కన పెట్టేశారు. ఎట్టకేలకు జులై 12 'ఇండియన్ 2' రిలీజ్ అయింది. దీంతో శంకర్ 'గేమ్ ఛేంజర్' ను పూర్తిచేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గానే రామ్ చరణ్ తన పార్ట్ షూటింగ్ అంతా కంప్లీట్ చేశాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఈ సినిమాకు సంబంధించి ఓ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడట. తొలుత ఈ మూవీ నుంచి వచ్చే లాభాల్లో షేర్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాడట. Also Read : బ్రిటీష్ సైనికుడిగా ప్రభాస్.. కొత్త సినిమా కోసం డార్లింగ్ స్పెషల్ మేకోవర్..! కానీ ఆలస్యమయ్యే కొద్ది నిర్మాత వడ్డీల భారం పెరుగుతుందని తెలిసి తన నిర్ణయాన్ని చరణ్ మార్చుకున్నాడట.పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానున్న 'గేమ్ ఛేంజర్' కోసం రామ్ చరణ్‌కి రూ.90 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట. షేర్ బట్టి చూస్తే ఇది కాస్త తక్కువ మొత్తమే అని తెలుస్తోంది. అగ్ర నిర్మాత దిల్ రాజు సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. #ram-charan #game-changer-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి