రాజిరెడ్డి చనిపోలేదు.. అది పాత వీడియో అంటున్న మాజీ మావోలు

మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతిపై మాజీ మావోయిస్టులు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజిరెడ్డి చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఆయన చనిపోయినట్లు సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియో పాతదని తెలిపారు

New Update
రాజిరెడ్డి చనిపోలేదు.. అది పాత వీడియో అంటున్న మాజీ మావోలు

మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతిపై మాజీ మావోయిస్టులు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజిరెడ్డి చనిపోలేదని, ఆయన చనిపోయినట్లు సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలు పాతవని స్పష్టం చేశారు. ఇటీవల సోషల్‌ మీడియాలో ఉన్న మృతదేహం దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు హరఖ్‌ అలియాస్‌ శ్రీకాంత్‌గా మాజీ మావోయిస్టులు తెలిపారు. మావోయిస్ట్ శ్రీకాంత్‌ 2012లోనే అనారోగ్యంతో మరణించాడని వెల్లడించారు. మావోయిస్ట్ పార్టీ అప్పటి వీడియోను ఇప్పుడు విడుదల చేసిందని, దీనీ వల్ల మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సాయన్న అలియాస్‌ మీసాల సత్తెన్న మృతిచెందాడని మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. దీనిపై మావోయిస్టు పార్టీ ప్రకటప విడుదల చేస్తేనే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.

కాగా గత రెండు రోజు క్రితం మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సాయన్న మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ నుంచి వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేయడంతో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అనారోగ్యం భారిన పడి మృతి చెందాడని పోలీసులు దృవీకరించారు. మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా మంథని మండల పరిధిలోని శాస్త్రులపల్లి. మల్లారెడ్డి గతంలో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా దండకారణ్యంలో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు. సంగ్రామ్‌, సాయన్న, మీసాల సాయన్న, అలోక్‌, అలియాస్‌ దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది.

రాజారెడ్డికి స్నేహాలత అనే కూతురు ఉంది. ఆమె తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్‌లో పనిచేస్తున్న కాలంలో స్నేహాలత ఉద్యమ సహచరుడు, ఓయూ ప్రొఫెసర్ కాశీంను పెళ్లి చేసుకున్నారు. గతంలో తెలంగాణ పోలీసులు కాశింను అరెస్ట్‌ చేసి ఆయన ఇంట్లో మావోయిస్టుల చెందిన పుస్తకాలను, పెండ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు