SSMB 29 : జక్కన్న- ప్రిన్స్ మూవీ టైటిల్ ఫిక్స్.. మహేష్ నయా లుక్ వైరల్!

రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న మూవీ టైటిల్ కు సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు ‘మహారాజ్‌’ అనే టైటిల్‌ను ఖారారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్ పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

New Update
SSMB 29 : జక్కన్న- ప్రిన్స్ మూవీ టైటిల్ ఫిక్స్.. మహేష్ నయా లుక్ వైరల్!

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) కాంబోలో భారీ ప్రాజెక్ట్‌ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా #SSMB 29 గా రాబోతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే మూవీ నుంచి అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ లుక్ ఎలా ఉండబోతుంది? రాజమౌళి ఎలా చూపించబోతున్నాడనే క్యూరియాసిటీ జనాల్లో మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ప్రిన్స్ సరికొత్త లుక్ కు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది.

పొడవాటి జుట్టు, గడ్డంతో..
ఈ మేరకు ప్రస్తుతం మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా... ఇందులో భాగంగానే చిత్ర బృందం కొన్నిరోజుల క్రితం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ పనులు ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చేశారు. మహేశ్‌బాబు-రాజమౌళిని ఒకే ఫ్రేమ్‌లో కనిపించగా.. పొడవాటి జుట్టు, గడ్డంతో మహేష్ కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి: Indian Embassy: దుబాయ్ ప్రయాణికులకు అలర్ట్.. కీలక ప్రకటన జారీ చేసిన అధికారులు!

మరో సరికొత్త ప్రపంచం..
ఇదిలావుంటే.. ఇప్పటికే భారతీయ చిత్ర పరిశ్రమలో మరో సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రచయిత విజయేంద్రప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో దీనిపై హింట్ ఇచ్చారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనుండగా.. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ తెరకెక్కించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘మహారాజ్‌’ (Maharaj) అనే టైటిల్‌ను ఖారారు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు