SSMB29 : రాజమౌళి - మహేష్ మూవీ టైటిల్ లీక్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్ మహేష్ - రాజమౌళి మూవీ టైటిల్ లీక్ అయింది. విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కలను ఉంచి #SSMB29, #SSMB29DIARIES అని పేర్కొన్నారు. దీంతో ఈ మూవీకి 'గరుడ' టైటిల్ ఫిక్స్ అయిందని ప్రచారం సాగుతోంది. By Anil Kumar 24 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి SSMB29 Movie : టాలీవుడ్లో ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇలాంటి తరుణంలో ఈ మూవీ టైటిల్ లీక్ అయింది. స్వయంగా ఈ సినిమా కోసం పనిచేస్తున్న టెక్నీషియన్ టైటిల్ పై హింట్ ఇవ్వడం గమనార్హం. విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కలను ఉంచి #SSMB29, #SSMB29DIARIES అని పేర్కొన్నారు. దీంతో మహేశ్‌బాబు కొత్త సినిమాకు ‘గరుడ’అనే టైటిల్ పెట్టనున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. మహేష్ ఫ్యాన్స్ అయితే ఈ వార్తను నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు. నిజానికి రాజమౌళి 'గరుడ' అనే టైటిల్ తో తాను ఓ సినిమా చేయబోతున్నాని కొన్నేళ్ల క్రిందటే అనౌన్స్ చేశారు. ‘బాహుబలి’ సినిమా తర్వాత తాను చేయబోయే ప్రాజెక్ట్ అదేనని కూడా తెలిపారు. అయితే, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రమే వెల్లడించలేదు. అయితే, అప్పుడు రాజమౌళి అనుకున్న ‘గరుడ’ ఇదేనా? కాదా? అన్నదానిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. #rajamouli #ssmb-29-movie-title #mahesh-babu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి