Rajamouli : జక్కన్న డైరెక్షన్ లో వార్నర్ యాక్టింగ్.. వీడియో చూస్తే నవ్వలేక చస్తారు! దర్శకధీరుడు రాజమౌళి, ఆస్ట్రేలియా క్రికెటర్ అండ్ సోషల్ మీడియా స్టార్ డేవిడ్ వార్నర్‌లకు సంబంధించి ఓ సరదా వీడియో ఇంటర్ నెట్ ను కుదిపేస్తోంది. వీరిద్దరి కలయికలో 'క్రెడ్ యాప్' (CRED) ప్రచారం కోసం చిత్రీకరించిన వీడియో నవ్వులు పూయిస్తోంది. దీనిపై ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. By srinivas 12 Apr 2024 in సినిమా స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Rajamouli - David Warner: దర్శకధీరుడు రాజమౌళి, ఆస్ట్రేలియా క్రికెటర్ అండ్ సోషల్ మీడియా స్టార్ డేవిడ్ వార్నర్‌లకు సంబంధించి ఓ సరదా వీడియో ఇంటర్ నెట్ ను కుదిపేస్తోంది. వీరిద్దరి కలయికలో 'క్రెడ్ యాప్' (CRED) ప్రచారం కోసం సదరు కంపెనీ నిర్వాహకులు ఫన్నీ వీడియో చిత్రీకరించగా జనాలకు నవ్వులు పూయిస్తోంది. అంతేకాదు ఈ వీడియోను నెట్టింట పోస్ట్ చేస్తూ వార్నర్ ఆసక్తికర క్యాప్షన్ ఇవ్వడం విశేషం. #SSRajamouli - #DavidWarner 😁😁 pic.twitter.com/cAC7ubN2jw — Vamsi Kaka (@vamsikaka) April 12, 2024 ఆస్కార్ స్టేజ్ మీద కలుద్దాం.. ఈ మేరకు 'నీ మ్యాచ్ టికెట్ల మీద డిస్కౌంట్ ఏమైనా ఉందా? అని రాజమౌళి వార్నర్ ను అడుగుతాడు. దీంతో 'క్రెడ్ యాప్ ఉందా? ఉంటే క్యాష్ బ్యాక్ వస్తుంది' అని వార్నర్ రిప్లై చెబుతాడు. ఈ క్రమంలో 'లేకపోతే ఏం చేయాలి?' అని రాజమౌళి అడుగుతాడు. దీంతో లేకపోతే డిస్కౌంట్ కోసం నువ్వు నాకు ఫేవర్ చేసి పెట్టాల్సి ఉంటుందని వార్నర్ అనడంతో రాజమౌళి డ్రీమ్స్‌లోకి వెళ్లడంతో ఈ యాడ్ మొదలవుతుంది. రాజమౌళి సినిమా తీస్తున్నట్టు.. ఒక్కో షాట్, ఒక్కో ఎమోషన్, ఒక్కో స్టెప్‌ని డెవిడ్ వార్నర్ కూనీ చేయడం చూసి రాజమౌళి తలపట్టుకుంటాడు. వార్నర్ తన నటనకు ఆస్కార్ వస్తుందని, ఆస్కార్ స్టేజ్ మీద కలుద్దామని అంటాడు. దీంతో రాజమౌళి ఓ చూపు చూస్తాడు. ఇక ఇలాంటి రాజమౌళిని డేవిడ్ దారుణంగా హింసిస్తుంటాడు. చివరా కలలోంచి తేరుకుని క్రెడ్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని పేమెంట్ చేసేస్తా అంటూ రాజమౌళి చెబుతాడు. అయితే ఈ ప్రకటనకు సంబంధిచిన వీడియోలో ఫుల్ కామెడీ ఉండగా జనాలు పడిపడి నవ్వుతున్నారు. డెవిడ్ వార్నర్ అంటే క్రికెటర్ అనుకుంటున్నారా? యాక్టర్ అంటూ.. డెవిడ్ తన ఇన్ స్టాలో ఈ యాడ్‌ను పోస్ట్ చేయడంపై కూడా ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. #david-warner #rajamouli #cred-app-video మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి