Raj Tarun : పదేళ్ల క్రితమే మాకు పెళ్లి.. నాకు అబార్షన్.. లావణ్య సంచలన ఆరోపణలు!

రాజ్‌తరుణ్ లవ్ వ్యవహారం రోజు రోజుకూ ఊహించని మలుపులు తిరుగుతోంది. రాజ్‌తరుణ్‌ తనకు అబార్షన్‌ చేయించాడని, అబార్షన్‌ చేయించిన మెడికల్‌ డాక్యుమెంట్స్‌ అన్నీ తన దగ్గర ఉన్నాయని లావణ్య తాజాగా తెలిపింది. అంతేకాదు ఆ డాక్యుమెంట్స్ ను నార్సింగి పోలీసులకు అందించినట్లు పేర్కొంది.

New Update
Raj Tarun : పదేళ్ల క్రితమే మాకు పెళ్లి.. నాకు అబార్షన్.. లావణ్య సంచలన ఆరోపణలు!

Raj Tarun - Lavanya Love Case : టాలీవుడ్ (Tollywood) హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun) లవ్ వ్యవహారం రోజు రోజుకూ ఊహించని మలుపులు తిరుగుతోంది. రాజ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని చివరికి మరో హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra) తో ఎఫైర్ పెట్టుకున్నాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రాజ్ తరుణ్ లావణ్య ఆరోపణలను కొట్టిపారేశాడు.

ఆమెనే తనను టార్చర్ చేస్తుందని రివర్స్ లో కేసు వేస్తానని అన్నాడు. ఇక లావణ్య (Lavanya) తాజాగా మరోసారి రాజ్‌తరుణ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. రాజ్‌తరుణ్‌ తనకు అబార్షన్‌ చేయించాడని, అబార్షన్‌ చేయించిన మెడికల్‌ డాక్యుమెంట్స్‌.. ఆస్పత్రి వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయని పేర్కొంటూ వాటిని నార్సింగి పోలీసులకు అందించినట్లు తెలిపింది.

Also Read : ‘మిస్టర్ బచ్చబ్’ సితార్ సాంగ్ వచ్చేసింది.. ఫారిన్ లో రవితేజ – భాగ్యశ్రీ డ్యూయెట్ అదుర్స్!

' రాజ్‌తరుణ్‌తో పదేళ్ల క్రితమే నాకు పెళ్లి అయ్యింది. పదేళ్ల నుంచి మేం కాపురం చేస్తున్నాం.లావణ్య అలియాస్‌ అన్విక పేరుతో కలిసున్నాం. అన్విక పేరుతో విదేశాలకు ఇద్దరం కలిసే వెళ్లాం. మాల్వీ వచ్చిన తర్వాతే రాజ్‌తరుణ్ నన్ను దూరం పెట్టాడు. ఇది ప్రశ్నించినందుకే నానుండి దూరంగా వెళ్ళిపోయాడు' అని చెప్పింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Anupama: ఆ స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. నెట్టింట దర్శనమిస్తున్న ఫొటో?

యువ నటుడు ధ్రువ్‌ విక్రమ్‌‌తో అనుపమ పరమేశ్వరన్ డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరు కిస్ చేసుకుంటున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది మూవీకి సంబంధించిన సీన్ అని కొందరు నెటిజన్లు అంటున్నారు.

New Update
Dhruv & Anupama

Dhruv & Anupama

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ యువ నటుడు ధ్రువ్‌ విక్రమ్‌‌తో డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరు కిస్ చేసుకుంటున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని నెటిజన్లు అంటున్నారు. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

సినిమాలోని ఫొటో అని కొందరు..

ఈ ఫొటో సినిమాలోనిదని మరికొందరు అంటున్నారు. ధ్రువ్, అనుపమ కలిసి 'బైసన్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ ప్రేయసిగా ధ్రువ్‌కి నటిస్తోంది. ఈ సినిమాలోని ఫొటో లీక్ అయి ఉండవచ్చని అంటున్నారు. మరి ఈ విషయంపై అనుపమ, ధ్రువ్, మూవీ టీం కానీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

 

dhruv-vikram | anupama-parameswaran | latest-telugu-news | telugu viral news | telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | latest tollywood updates

Advertisment
Advertisment
Advertisment