ఏపీలో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న రెండు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

New Update
ఏపీలో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్

ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో పలు ప్రాంతాలు అతలాకుతలమైపోగా జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బురద, మంచినీరు, కరెంట్ తదితర సమస్యలనుంచి పూర్తిగా బయటపడకముందే మళ్లీ వర్షాలు రాబోతున్నాయంటూ కీలక ప్రకటన చేసింది.

ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, తమిళనాడుతోపాటు పరిసర ప్రాంతాలపైకి సముద్రం నుంచి తూర్పు గాలులు వీస్తున్నట్లు తెలిపింది. ఈ ఎఫెక్ట్ కారణంగా ఈ రెండు రోజుల్లో ఏపీలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసమీ, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని ఏపీ యనాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇది కూడా చదవండి : అమెరికా వీధుల్లో రామనామస్మరణ.. మార్మోగిపోయిన వాషింగ్టన్ డీసీ

మరొకవైపు రెండు తెలుగు రాష్ట్రాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండటంతో చలి తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ మన్యం, పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు పొగ మంచు కమ్మేస్తుంది. చల్లటి గాలులకు తోడు పొగమంచు ప్రభావం కూడా ఉంటోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు