Dubai: దుబాయ్‌ని వెంటాడుతున్న వర్ష భయం..

కుండపోత వర్షంతో అతలాకుతలం అయిన దుబాయ్‌ను మరోసారి వర్షాలు భయపెడుతున్నాయి. వచ్చే వారంలో మళ్ళీ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుబాయ్‌కు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఇండియన్ ఎంబసీ సూచిస్తోంది.

New Update
Dubai: దుబాయ్‌ని వెంటాడుతున్న వర్ష భయం..

Dubai Rains: దుబాయ్‌కు మళ్ళీ వర్ష బయం పట్టు్కుంది. మొన్న కురిసిన వర్షానికి మొత్తం నగరం అంతా అల్లకల్లోలం అయిపోయింది. విమానాల రాకపోకలు ఆగిపోయాయి.మొత్తం నీటితో నిండిపోయింది. దాంట్లో నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు ప్రజలు. కానీ మళ్ళీ వారిని కుంభవృష్టి ముంచెత్తనుందని దుబాయ్ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే వారంలో మళ్లీ కుండపోత కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో ఆ దేశ ప్రజలు, టూరిస్టుల్లో ఆందోళన మొదలయ్యింది. దీంతో పాటూ దుబాయ్‌కి ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని..ఇండియన్‌ ఎంబసీ సూచించింది. ఇక అంతర్జాతీయ విమానాల రాకపోకలు కూడా ఇప్పుడిప్పుడూ పునరుద్ధరణ చేస్తున్నారు. ఇంకా పూర్తిగా విమానాశ్రయం అందుబాటులోకి రాలేదు.

ఆకుపచ్చగా మారిన ఆకాశం..
దీనికి తోడు దుబాయ్ వర్షాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా వర్షం పడడానికి ముందు అక్కడి ఆకాశం పచ్చగా మారిపోతోంది. దాని తర్వాతనే కుభవృష్టి వర్షాలు పడుతున్నాయి. దీని తీలూకా వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అయితే క్లౌడ్ సీడింగ్ కారణంగానే ఆకాశం పచ్చగా మారుతోందని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. దీన్ని బట్టే వర్సాలను అంచనా వేయొచ్చని తెలిపారు.

Also Read:Movies: వార్నీ ఆ గొవడంతా మూవీ ప్రమోషన్స్ కోసమా..ప్రియదర్శి డార్లింగ్ మూవీ గ్లింప్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు