Paris Olympics: ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీకి వర్షం భయం

మరికాసేపట్లో ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఫ్రాన్స్ కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు...భారత కాలమానం ప్రకారం రాత్రి ఒంటిగంటకు ఇది ప్రారంభం అవుతుంది. అయితే సీన్ నదిలో నిర్వహిస్తున్న ఒలింపిక్స్ పరేడ్‌ను వాన గండం ఉందని చెబుతున్నారు.

New Update
Paris Olympics: ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీకి వర్షం భయం

Opening Cermony: పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఈరోజు సాయంత్రం 7.30గంటలకు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు మొదలవనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటలు దాటేంత వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ వేడుకలను గ్రాండ్‌గా చేయడానికి ఏర్పాట్లు చేసింది ఫ్రాన్స్ ప్రభుత్వం. అయితే ఈసారి ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ ఎప్పటిలా స్టేడియం లోపల కాకుండా పారిస్ మీదుగా ప్రవహించే సీన్ నది తీరంలో నిర్వహించున్నారు.

ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీలో క్రీడాకారులు పరేడ్ నిర్వహిస్తారు. కానీ ఈసారి మాత్రం బోట్ల మీద చేయనున్నారు. దాదాపు 10,500 మంది అథ్లెట్లు 100 బోట్లలో పరేడ్ చేయనున్నారు. సీన్‌ నదిలోని ఐకానిక్ బ్రిడ్జిలు, ల్యాండ్ మార్క్‌లను దాటుకుంటూ.. సీన్ నదిలో ఆరు కిలోమీటర్ల మేర అథ్లెట్ల బోట్ పరేడ్ కొనసాగనుంది. ఈ వేడుకలను 6 లక్షల మంది ప్రత్యక్షంగా తిలకించేలా ఫ్రాన్స్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మన దేశంలోని స్పోర్ట్స్ 18 నెట్ వర్క్ ద్వారా ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీని లైవ్‌లో చూడొచ్చు. అలాగే జియో సినిమా యాప్, వెబ్ సైట్ల ద్వారానూ లైవ్‌లో చూడొచ్చు.

అయితే ఈ ప్రారంభ వేడుకలకు వాన గండం ఉందని చెబుతోంది అక్కడ వాతావారణ శాఖ. ఉష్ణోగ్రతలు 20 నుంచి 24 వరకు ఉంటాయని చెప్పింది. కానీ తేలిక పాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని అంటోంది. సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం అవుతుందని..చిరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Also Read:Andhra Pradesh: టెట్ కోసం ఉచిత శిక్షణా కేంద్రాలు..ఏపీ సర్కార్ ఆఫర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment