Vande Bharat: రైల్వేశాఖ సరికొత్త ప్లాన్.. త్వరలో వందే మెట్రో

దేశంలో వందే భారత్‌ రైళ్ల తర్వాత ఇప్పుడు వందే మెట్రోను ప్రారంభించాలని యోచిస్తోంది రైల్వేశాఖ. 2024 జులై నుంచి వందే మెట్రో ట్రయల్ రన్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు.

New Update
Vande Bharat: వందే భారత్ రైలు రూఫ్‌ నుంచి కారిన నీరు

ప్రస్తుతం దేశంలోని పలు రూట్లలో సెమీ-హై స్పీడ్ వందే భారత్‌ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. వీటి విజయం తర్వాత ఇప్పుడు భారత రైల్వే దేశంలో వందే మెట్రోను ప్రారంభించాలని యోచిస్తోందని.. అలాగే ఇంట్రా-సిటీ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌ను మార్చేందుకు ప్లాన్ వేస్తోందని.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధం ఉన్న ఓ సీనియర్ అధికారి చెప్పారు. 2024 జులై నుంచి వందే మెట్రో ట్రయల్ రన్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే ఎక్కవ స్టాప్‌లు కవర్‌ చేస్తూ వేగంగా ప్రయాణించేలా ఆధునిక సాంకేతికతతో పాటు అనేక ఫీచర్లు ఈ మెట్రో రైలులో ఉండనున్నాయి.

Also Read: త్వరలో తెలంగాణలో ఉప ఎన్నిక.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

వందే మెట్రో అనేది ప్రత్యేకమైన కోచ్‌ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ ట్రైన్‌లో నాలుగు కోచ్‌లు కలిపి ఒక యూనిట్‌గా ఉంటాయని పేర్కొన్నాయి. ప్రాథమికంగా కనీసం 12 కోచ్‌లు ఉంటాయని.. భవిష్యత్తులో డిమాండ్‌కు అనుగుణంగా కోచ్‌లను 16 వరకు కూడా పెంచుతారని వెల్లడించాయి.

Also Read: కేజ్రీవాల్‌ తో భార్య ములాఖత్‌ రద్దు!

Advertisment
Advertisment
తాజా కథనాలు