Railway Minister : గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ మంత్రి.. ప్రతి టికెట్ పై 55 శాతం రాయితీ! సీనియర్ సిటిజన్లు, ప్రభుత్వ గుర్తింపు ఉన్న జర్నలిస్టులకు రైలు టికెట్ పై రాయితీ గురించి విలేకర్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను విలేకర్లు ప్రశ్నించారు.దానికి సమాధానంగా ఆయన ప్రతి ఒక్కరికీ కూడా రూ. 55 రాయితీ రైల్వేశాఖ ఇస్తోంది అని పేర్కొన్నారు. By Bhavana 13 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Indian Railways : ఇక నుంచి రైలులో ప్రయాణించే ప్రతి ప్రయాణికుని టికెట్ పై కూడా 55 శాతం రాయితీ లభిస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) తెలిపారు. కరోనా రాక ముందు రైల్వే శాఖ సీనియర్ సిటిజన్స్, ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైలు టికెట్ పై 50 శాతం రాయితీ ఇచ్చేవారు. అయితే కరోనా(Corona) వచ్చిన తరువాత కేంద్రం లాక్ డౌన్(Lockdown) విధించిన తరువాత వయో వృద్దులతో మరికొంతమంది ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను భారతీయ రైల్వే శాఖ(Indian Railways) నిలిపివేసింది. అంతే కాకుండా వారి వద్ద నుంచి పూర్తి స్థాయి ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. లాక్ డౌన్ అయిపోయి కూడా రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా రాయితీలను రైల్వే శాఖ పునరుద్దరించలేదు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు.. ఈ అంశం గురించి అనేక సార్లు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ఎన్ని ప్రశ్నలు తలెత్తినప్పటికీ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాత్రం సమాధానం చెప్పకుండా ఉండేవారు. ఈ క్రమంలోనే వైష్ణవ్ శుక్రవారం నాడు గుజరాత్ లోని అహ్మదాబాద్(Ahmedabad) లో బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లు, ప్రభుత్వ గుర్తింపు ఉన్న జర్నలిస్టులకు రైలు టికెట్ పై రాయితీ గురించి విలేకర్లు ఆయన్ని ప్రశ్నించారు. రూ. 55 రాయితీ ఇస్తోంది... ఈ క్రమంలో మంత్రి వైష్ణవ్ విలేకర్లు అడిగిన ప్రశ్నలకు పరోక్షంగా స్పందించారు. '' ప్రయాణికుడు గమ్య స్థానానికి చేరుకోవడానికి రైలు టికెట్ కు రూ. 100 ఉంటే, రైల్వే మాత్రం వారి వద్ద నుంచి 45 రూపాయలనే వసూలు చేస్తోంది. అంటే ప్రతి ఒక్కరికీ కూడా రూ. 55 రాయితీ ఇస్తోంది'' అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రైల్వే శాఖ ఏసీ కంపార్ట్ మెంట్లలో ప్రయాణించే ఆర్‌ఏసీ(RAC) పాసింజర్ల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌ఏసీ టికెట్ కలిగిన ప్రయాణికులందరికీ కూడా ఓ స్పెషల్ బెడ్ రోల్ కిట్ ను అందించనున్నట్లు వివరించారు. దీని గురించి రైల్వే బోర్డు ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్ చెప్పారు. స్పెషల్ బెడ్ రోల్ కిట్.. ప్రయాణికునికి అందించే కిట్ లో ఓ బెడ్ షీట్, దుప్పటి, టవలత్ పాటు ఓ తలగడ కూడా ఉండనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం ఏసీ ఛైర్ కార్ ప్రయాణికులకు వర్తించదని చెప్పారు. Also read: జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవదహనం! #indian-railways #corona #ashwini-vaishnaw #ahmedabad #lockdown మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి