కార్పెంటర్ గా మారిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ మధ్య ప్రజల్లో ఎక్కువ కనిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన రైల్వే కూలీ అవతారం ఎత్తితే..తాజాగా ఆయన కార్పెంటర్(Carpentar) అవతారం ఎత్తారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఆయన రకరకాల అవతారాలు ఎత్తుతున్నారు. By Bhavana 29 Sep 2023 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ మధ్య ప్రజల్లో ఎక్కువ కనిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన రైల్వే కూలీ అవతారం ఎత్తితే..తాజాగా ఆయన కార్పెంటర్(Carpentar) అవతారం ఎత్తారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఆయన రకరకాల అవతారాలు ఎత్తుతున్నారు. తాజాగా గురువారం ఆయన ఢిల్లీలోని కీర్తి నగర్ లోని ఫర్నిచర్ మార్కెట్(Furniture Market) ను సందర్శించారు. అక్కడ పని చేస్తున్న కార్పెంటర్లు, కార్మికులతో ఆయన ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి జీవన విధానం ఎలా కొనసాగుతుంది అంటూ ఆరా తీశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన కార్పెంటర్ లా మారి పని చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలను, ఫోటోలను కాంగ్రెస్ పార్టీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. అందులో రాహుల్ వారితో కలిసి పని చేశారు. వారితో ముచ్చటించారు. దీని గురించి రాహుల్ స్పందిస్తూ'' ఆసియాలోనే అతిపెద్ద ఫర్నీచర్ మార్కెట్ అయిన ఢిల్లీలోని కీర్తి నగర్ కు వెళ్లాను. వారు చాలా కష్టపడి పని చేస్తున్నారు. వారంతా కూడా అద్భుతమైన కళాకారులు, నాణ్యమైన, దృఢమైన, అందమైన వాటిని రూపొందించడంలో వీరు ప్రవీణులు!’ అంటూ రాసుకొచ్చారు. వారితో నాకు చాలా సంభాషణలు జరిగాయని చెప్పుకొచ్చారు. వారి నైప్యుణ్యాల గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నించానని అన్నారు. సెప్టెంబర్ 21న కూడా రాహుల్ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో రాహుల్ అక్కడ పని చేసే కూలీలతో మమేకం అయ్యారు. వాళ్లతో చాలా సేపు మాట్లాడారు. అక్కడ పోర్టర్ డ్రెస్ కూడా వేసుకున్నారు. బ్యాడ్జ్ కూడా పెట్టుకున్నారు. కూలీలా ఓ సూట్ కేసుని కూడా మోశారు. అప్పట్లో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ సమయంలో ఆయన బిలాస్ పూర్ నుంచి రాయ్ పూర్ వరకు రైలులో ప్రయాణించారు. కొంతకాలం క్రితం రాహుల్ పండ్లు, కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను కలిసి మాట్లాడారు. అంతకు ముందు ఆయన పొలంలోకి దిగి రైతులతో మాట్లాడారు. వారితో పాటు నాట్లు కూడా వేశారు. ట్రాక్టర్ తో దున్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన విద్యార్థులు,కూలీలు, మెకానిక్ లు ఇలా అందరితో మమేకమై ముందుకు సాగారు. दिल्ली के कीर्तिनगर स्थित एशिया के सबसे बड़े फर्नीचर मार्केट जाकर आज बढ़ई भाइयों से मुलाकात की।ये मेहनती होने के साथ ही कमाल के कलाकार भी हैं - मज़बूती और खुबसूरती तराशने में माहिर! काफ़ी बातें हुई, थोड़ा उनके हुनर को जाना और थोड़ा सीखने की कोशिश की। pic.twitter.com/ceNGDWKTR8— Rahul Gandhi (@RahulGandhi) September 28, 2023 #congress #rahul-gandhi #elections #carpentar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి