Bharath Jodo Yatra:తేజస్వి యాదవ్ జీపులో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జీప్‌లో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ప్రయాణించారు. తేజస్వీతో పాటూ జీపులో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేవారు. కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

New Update
Bharath Jodo Yatra:తేజస్వి యాదవ్ జీపులో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

Rahul Travelled in Tejaswi yadav Jeep:వాళ్ళిద్దరూ ఇద్దరు బడా నేతల కుమారులు. వేర్వేరు పార్టీలు అయినా ఒకే కూటమిలో ఉన్నారు. ఒకే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇండియా కూటమిలో ఇద్దరూ ముఖ్య నేతలు. అందులో ఒకరు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాందీ అయితే అర్జేడీ నేత తేజస్వి యాదవ్ మరొకరు. ప్రస్తుతం రాహుల్ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఆయన తేజస్వి యాదవ్ జీపులో ప్రయాణం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు పాపులర్ అవుతోంది. ఇద్దరు బడా నేతల కుమారులు ఇలా ఒకే వాహనంలో వెళ్ళడం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. జేడీయూ-ఆర్జేడీ బంధం ముగిశాక వీరిద్దరూ కలిసి ప్రచారంలో పాల్గొనడంతో మరింత క్రేజ్ వస్తోంది.

బీహార్‌లో న్యాయ్ యాత్ర..

రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం బీహార్‌లో జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు రాహుల్‌తో పాటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా వచ్చారు. దీని కోసం తన ఎర్ర రంగు జీప్ వ్రాంగ్లర్‌లో వచ్చారు తేజస్వి. దీంతో రాహుల్ వెంటనే తేజస్వి కారు ఎక్కి కూర్చున్నారు. ఈయనతో పాటూ ఇతర కీలక నేతలు కూడా జీప్‌లో కూర్చున్నారు. తరువాత తేజస్వీ స్వయంగా డ్రైవింగ్‌ చేసి ఇరు పార్టీల కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అక్కడ యాత్ర జరిగినంత సేపు ఆయనే వాహనాన్ని నడిపారు కూడా.దీనికి సంబందించిన ఫొటోలను తేజస్వీ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు.

34వ రోజుకు చేరుకున్న భారత్ జోడో యాత్ర..

రాహుల్ భారత్ జోడో యాత్ర 34వ రోజుకు చేరుకుంది. ఈరోజుతో బీహార్‌లో యాత్ర ముగించుకుని రాహుల్ రేపు ఉత్తరప్రదేశ్ చేరుకోనున్నారు. ఈరోజు రాహుల్‌ గాంధీ రోహ్‌తాస్‌లో రైతు నాయకులతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2.30కు తేజస్వీ, రాహుల్‌ కలిసి కైముర్‌లోని బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు ఇక్కడి నుంచి బయలు దేరి ఉత్తరప్రదేశ్‌కు చేరుకుంటారు. అక్కడ ఈరోజు నైట్ రాహుల్ భదోహీ పొలాల్లో ఉండనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 13 జిల్లాల్లో 785 కిలోమీటర్ల మేర ఏడు రోజులపాటు యాత్ర జరగనుంది. ఫిబ్రవరి 25 తేదీ వరకు రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోనే ఉంటారు. మధ్యలో 22, 23 తేదీల్లో యాత్రకు విరామం ఇవ్వనున్నారు.

Also Read:Hyderabad:నువ్వు చేయాల్సిందేంటీ..చేస్తున్నదేంటీ..బస్సులో మహిళా క్రికెటర్ల కోచ్ జై సింహ నిర్వాకం

Advertisment
Advertisment
తాజా కథనాలు