Lok Sabha: రాహుల్ గాంధీ పోటీపై ఉత్కంఠ వీడినట్లేనా? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం లేదా భువనగిరినుంచి ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు అంగీకరించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు వీహెచ్ సైతం ఖమ్మం బరిలో ఉండబోతున్నట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. By srinivas 27 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ నుంచి కూడా రాహుల్ బరిలో నిలిచే అవకాశం కనిపిస్తుండగా మరోచోటుపై జోరుగా చర్చ నడుస్తుంది. అయితే తాజా పరిణామాలను పరిశీలిస్తే తెలంగాణనుంచే రాహుల్ బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం లేదా భువనగిరి లోక్ సభ స్థానాలనుంచి ఆయన పోటీ చేయబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా టాక్ వినిపిస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకే.. ఈ మేరకు కాంగ్రెస్ ఉన్నతస్థాయి వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తుందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నామని, ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేశారు. ఇక రాహుల్‌గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ పార్టీ మరింత బలోపేతం అవుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాజనకంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: Kerala : రోడ్డుకు పెళ్లి.. అతిథులకు అదిరిపోయే విందు! సోనియా గాంధీ తిరస్కరించడంతో.. మరోవైపు సోనియాగాంధీ తెలంగాణలో పోటీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలచుకోలేదని, నియోజకవర్గానికి న్యాయం చేయలేనని ఆమె పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వీహెచ్ సైతం బరిలో దిగుతానంటూ.. ఈ నేపథ్యంలోనే రాహుల్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కేరళలోని వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్‌ను.. ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయించే అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు నేతలతో సమావేశమైన రాహుల్ పోటీకి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఖమ్మం లేదా భువనగిరి నుంచి ఆయన పోటీ చేస్తానని సన్నిహితులతో చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు సీనియర్ నాయకుడు వీహెచ్ తాను ఖమ్మం బరిలో దిగబోతున్నట్లు ప్రకటించడం విశేషం. కాగా మరోసారి కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. #telangana #rahul-gandhi #lok-sabha-elections #bhuvanagiri #kammam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి