ఆ ఒక్క సీన్ కోసం వాళ్లతో రెండు రాత్రులు గడిపాను.. రాధిక ఆప్టే

అప్ కమింగ్ మూవీ ‘మేరీ క్రిస్మస్‌’లో తను పోషించిన క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది రాధిక ఆప్టే. డిసెంబర్ 15న రిలీజ్ కాబోతున్న సినిమాలో తాను ఒకే సీన్ లో కనిపించబోతున్నట్లు తెలిపింది. కానీ ఆ ఒక్క సీన్ కోసమే రెండు రాత్రులు షూటింగ్ లో పాల్గొన్నట్లు వెల్లడించింది.

New Update
ఆ ఒక్క సీన్ కోసం వాళ్లతో రెండు రాత్రులు గడిపాను.. రాధిక ఆప్టే

స్టార్ నటి రాధిక ఆప్టే తన అప్ కమింగ్ మూవీ ‘మేరీ క్రిస్మస్‌’లో తను పోషించిన క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీషోల్లోనూ నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్న ఆమె.. రీసెంట్‌గా కత్రినాకైఫ్‌ మెయిన్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాలో అతిథిపాత్రలో కనిపించనుంది. అయితే ఈ చిత్రం డిసెంబ‌ర్ 15న రిలీజ్ కాబోతుండగా తెగ ప్రచారం చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక.. శ్రీరాం రాఘవన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో గెస్ట్ రోల్ పోషించే అవకాశం రావడం ఆనందంగా ఉందని చెప్పింది.

తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమాలో తన క్యారెక్టర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెబుతూ.. 'ఇందులో నేను కేవలం ఒకే ఒక్క సీన్ లో కనిపించబోతున్నా. ఇలాంటి పాత్ర చేయడానికి దర్శకుడు శ్రీరామ్ కారణం. ఆయన నాకు మంచి ఫ్రెండ్ కావడంతో కాదనలేకపోయాను. ఒక రోజు నాకు ఫోన్ చేసి ఒక పాత్ర పోషించాలని చెప్పారు. అదీ ఒక్క సీన్ లోనే కనిపించాల్సి ఉందనడంతో ముందు షాక్ అయ్యాను. ఆ తర్వాత స్టోరీ గురించి వివరించాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా. అయితే ఇందులో నేను చేసింది ఒకే సీన్ అయినా.. షూటింగ్‌ మాత్రం రెండు రాత్రుళ్లు పాల్గొనాల్సి వచ్చింది. దర్శకుడు సినిమా పర్ఫెక్ట్ గా వచ్చేందుకు ఎంతగా కష్టపడతాడనే దానికి ఈ సీన్ షూటింగే నిదర్శనం. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. నా కెరీర్ లోనూ ప్రత్యేకంగా నిలిచిపోతుంది' అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. ‘అక్క’ పేరుతో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న అప్ కమింగ్ వెబ్ సిరీస్ లోనూ కీర్తి సురేష్ తో కలిసి రాధికా ఆప్టే ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

Also read :AP Barrelakka: ఏపీలో మరో బర్రెలక్క.. ఏకంగా ఎమ్మెల్యే కేతిరెడ్డిపైనే పోటీకి సై.. వైరల్ వీడియో!

ఇక 'మేరీ క్రిస్మ‌స్' మూవీతోనే విజ‌య్ సేతుప‌తి బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయాల్సింది. అత‌డు హిందీలో సైన్ చేసిన ఫ‌స్ట్ మూవీ ఇది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో విజయ్ మూడో సినిమాగా రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది 'ముంబైక‌ర్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు విజ‌య సేతుప‌తి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment