R. Krishnayyah: బీసీల అభివృద్ధి చూడలేక అగ్రవర్ణాలు జగన్ పై పగబట్టారు: ఆర్. కృష్ణయ్య! దేశంలో ఏ రాష్ట్రంలోని లేని బీసీల అభివృద్ధి ఏపీలో ఉందని బీసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. జగన్ బీసీల అభివృద్ధి చేస్తుంటే చూడలేని అగ్రవర్ణాల పెద్దలు చూడలేకపోతున్నారంటూ విమర్శించారు. By Bhavana 29 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఏపీ (AP) రాష్ట్రంలో దేశంలో ఎక్కడలేని విధంగా బీసీ (BC) ల్లో చైతన్యం వచ్చిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు , రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య(R. krishnayya) అన్నారు. బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీసీలు అభివృద్ధిలో ముందుంటున్నారు. ఆ తరువాత ఏపీలోనే బీసీలు ముందున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్ (Jagan) ప్రవేశ పెట్టిన పథకాల వల్లే బీసీలు అభివృద్దిలో ముందుకు వెళ్తున్నారని కృష్ణయ్య అన్నారు. బీసీల అభివృద్ధి చూడలేక అగ్రవర్ణాల పెద్దలు జగన్ పై పగపట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రికి శత్రువులు ఎక్కువ అయ్యారని ఆయన విమర్శించారు. ఏపీలో ఉన్న అన్ని పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని వివరించారు. బీసీలకు సుమారు 50 శాతం నామినేటెడ్ పదవులు కేటాయించారని తెలిపారు. ఇప్పటికీ చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్ కావాలని పోరాడుతున్నామని తెలిపారు.పార్లమెంటులో బీసీల బిల్లు పెట్టాలంటూ 800 సార్లు ముట్టడి చేసినట్లు వివరించారు. బీసీల బిల్లు ముగింపు దశలో ఉంది... అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కులగణన వల్ల బీసీలకు మేలు జరుగుతుందని కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.కులగణన చేస్తామన్న రాహుల్ గాంధీ ప్రకటన హర్షణీయమని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేయకపోతే ప్రపంచ వేదికలపై మాట్లాడి, పోరాటం చేస్తామని తెలిపారు. మోడీ ప్రభుత్వం కుల గణన చేసేందుకు సుముఖంగా లేదు. బీజేపీ వైఖరి మార్చుకోవాలని అన్నారు. Also read: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. రహదారులను కమ్మేస్తున్న పొగమంచు.. #jagan #ap #politics #r-krishnayya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి